కృష్ణ

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీడీపీ పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలుగుదేశం ఎప్పుడూ పని చేస్తుందని ఆ పార్టీ శాసనమండలి సభ్యుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్ని అసెంబ్లీలో వికేంద్రీకరణ, సీఆర్‌డీఎ బిల్లును ఆమోదించినా శాసనమండలిలో మాత్రం ప్రజాస్వామ్యానికి విలువ ఇస్తూ మండలి చైర్మన్ ఆ రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడం జరిగిందన్నారు. దీన్ని హర్షిస్తూ గురువారం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి పివి ఫణికుమార్ రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడంలో పోరాడిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడును ఘనంగా సత్కరించారు. అమరావతి రాజధాని కోసం శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యులు అలుపెరగని పోరాటం చేశారన్నారు. పాలకులు ఆత్మ విశ్వాసం కలిగి ఉండాలి గానీ అతివిశ్వాసం కలిగి ఉండకూడదన్న విషయాన్ని ఈ ఘటన రుజువు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎఆర్‌కె మూర్తి, జిల్లా అధ్యక్షుడు గాదె శ్రీనివాస శర్మ, న్యాయవాది బృందావనం శ్యామ్ కుమార్, టంకాల రమణ తదితరులు పాల్గొన్నారు.