కృష్ణ

డివిజన్‌లో 31,928 మంది లబ్ధిదారుల గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ళ స్థలాలివ్వాలని సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశించారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. శనివారం గుడివాడ రూరల్ మండలం మల్లాయిపాలెం, పట్టణ పరిధిలోని బేతవోలులో ఇళ్ళ స్థలాల కోసం సేకరించనున్న 58 ఎకరాల భూమిని మండల తహసీల్దార్‌తో కలిసి మంత్రి కొడాలి నాని పరిశీలించారు. సర్వే నెంబర్ల ఆధారంగా ఆయా భూములు నివాసానికి అనువైనవా, కావా అన్నది స్వయంగా చూశారు. ఇళ్ళ స్థలాలకు ఈ భూములను కేటాయించిన తర్వాత అక్కడ ఏర్పాటు చేయాల్సిన మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం, ఇతర వౌలిక సదుపాయాల కల్పన ఏ విధంగా చేయాలన్నది పరిశీలించారు. ఆయా భూములకు పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న మహిళలతో మాట్లాడారు. ఇళ్ళ స్థలాలు కేటాయించిన తర్వాత అక్కడ ఎదురయ్యే సమస్యలను అధ్యయనం చేశారు. అనంతరం మంత్రి నాని మాట్లాడుతూ గుడివాడ డివిజన్‌లోని 9 మండలాల్లో 31,928 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించామన్నారు. వీరందరికీ ఇళ్ళ స్థలాల కోసం 449.38 ఎకరాల ప్రభుత్వ భూమి సిద్ధంగా ఉందన్నారు. ఇంకా 178.14 ఎకరాల ప్రైవేట్ భూమిని రైతుల నుండి సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గుడివాడ పట్టణంలోని లబ్ధిదారుల కోసం 58 ఎకరాల ప్రైవేట్ భూమిని సేకరించనున్నామన్నారు. గుడివాడ రూరల్ మండలం మల్లాయిపాలెం, పట్టణ పరిధిలోని బేతవోలు ప్రాంతాల్లో 58 ఎకరాల భూమిని పరిశీలించామన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పేదవాడి సొంతింటి కలను నిజం చేసేందుకు కృషి చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఆర్ పాపమ్మ తదితరులు పాల్గొన్నారు.

పోస్టర్ల ద్వారా దిశ చట్టం ప్రచారం
జి.కొండూరు, జనవరి 25: దిశ చట్టంపై పోస్టర్ల ద్వారా ప్రచారాన్ని ప్రారంభించారు. జి.కొండూరులోని అంగన్‌వాడీ కార్యకర్తలు పోస్టర్లను బస్సులకు, ఆటోలు, ఇతర వాహనాలకు శనివారం అతికించారు. మైలవరం ఐసిడిఎస్ సూపర్‌వైజర్ ఇందుపల్లి అన్నమ్మ మాట్లాడుతూ జి.కొండూరు మాజీ ఎంపిటిసి వేములకొండ సాంబశివరావు 200 పోస్టర్లను వితరణగా ముద్రించారన్నారు. వీటిని శనివారం 100కి పైగా వాహనాలకు అతికించినట్లు ఐసిడిఎస్ టీచర్లు తెలిపారు. దిశ చట్టం ద్వారా ప్రత్యేక న్యాయస్థానాలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కాల్‌సెంటర్లు, ఫోరెన్సిక్ ల్యాబ్‌లు, నేరం జరిగిన 21 రోజుల్లో నిందితునికి ఉరిశిక్ష విధించడం జరుగుతుందన్నారు. మహిళల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఐసిడిఎస్ టీచర్లు వాణి, చందన, నాగరాణి, హేమ, నాగమణి, జ్యోతి, జయకుమారి, మేరి తదితరులు పాల్గొన్నారు.