కృష్ణ

మూడు రాజధానులు జగన్ సీఎం సొంత అజెండానే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: గతంలో తుగ్లక్ పాలనను చూసిన రాష్ట్ర ప్రజలు నేడు తుగ్లక్‌ను మించిన జగ్లక్ పాలనను చూస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సొంత అజెండాతో రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మూడు రాజధానులు సీఎం జగన్ సొంత అజెండా మాత్రమేనన్నారు. ఆ సొంత అజెండాను అమలు చేసేందుకు మెజార్టీ ఉందన్న ఒకే ఒక్క కారణంతో చట్టసభలను సైతం తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ జగన్ నియంత పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడతామన్నారు. శనివారం స్థానిక ప్రధాన పార్కు ఎదురుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాభిష్టం మేరకు వికేంద్రీకరణ, సీఆర్‌డీఎ రద్దు బిల్లులకు శాసనమండలిలో టీడీపీ బ్రేక్‌లు వేసిందన్నారు. అసెంబ్లీలో ఆమోదించబడిన ఈ రెండు బిల్లులను శాసనమండలి ద్వారా సెలక్ట్ కమిటీకి పంపడం చారిత్రక విజయమన్నారు. దీన్ని చూసి ఓర్వలేని సీఎం జగన్ శాసనమండలినే రద్దు చేసేందుకు ముందుకు రావడం అతని అహంభావానికి నిదర్శనమన్నారు. శాసనమండలిలో బిల్లులను ఆమోదింప చేసుకునేందుకు రాష్ట్ర మంత్రులు వ్యవహరించిన తీరు దేశ ప్రజలు ముక్కున వేలువేసుకునేలా ఉందన్నారు. శాసనమండలిలో ఉండే మేధావులు, పెద్దలు అసెంబ్లీలోనూ ఉన్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. 151 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో 89 మంది నేర చరిత్ర కలిగిన వారేనన్న విషయాన్ని సీఎం జగన్ గుర్తు పెట్టుకోవాలన్నారు. అటువంటి క్రిమినల్స్‌ను మేధావులతో పోల్చడం గర్హనీయమన్నారు. ఆర్థిక నేరాల్లో ఎ1 నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జైలు ఖర్చుతో పోలిస్తే శాసనమండలి నిర్వహణకు చేస్తున్న ఖర్చు ఏ మాత్రం సరితూగదన్నారు. శాసనమండలి నిర్వహణకు ఏడాదికి రూ.60కోట్లు ఖర్చు అవుతుందన్న జగన్ తన కోర్టు ఖర్చులు ఎంతో ప్రజలకు చెప్పాలన్నారు. సీబీఐ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న జగన్ వారానికి రూ.60లక్షలు చొప్పున సంవత్సరానికి రూ.30కోట్లు, ఏడాదికి రూ.150కోట్లు ఖర్చు చేస్తున్న విషయం వాస్తవం కాదా అన్నారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ అసెంబ్లీలో సంఖ్యాబలం ఉందని మండలి రద్దు చేయాలనుకోవడం ముఖ్యమంత్రి జగన్ అహంభావానికి పరాకాష్ట అన్నారు. రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించిన శాసనమండలి చైర్మన్ షరీఫ్‌పై వైసీపీ మంత్రులు పరుషపదజాలంతో దూషించడం వారి సంస్కృతిని తెలియజేస్తుందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారే గానీ ప్రజలకు పాలన అందించిన పాపాన పోలేదన్నారు. జగన్ వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందన్నారు. పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. జగన్ తీరు మారకుంటే రాజకీయంగా ఉనికి కోల్పోయే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘ నాయకుడు కొనకళ్ల జగన్నాథరావు (బుల్లయ్య), మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపిచంద్, అమరావతి జేఎసీ కన్వీనర్ మురళీకృష్ణ, టీడీపీ పట్టణ, మండల అధ్యక్షులు ఇలియాస్ పాషా, కుంచే దుర్గాప్రసాద్(నాని), మాజీ కౌన్సిలర్లు గనిపిశెట్టి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.