కృష్ణ

కృష్ణా వర్సిటీ కొత్త క్యాంపస్‌లో కళతప్పిన రిపబ్లిక్ డే వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: కృష్ణా విశ్వ విద్యాలయం నూతన క్యాంపస్‌లో తొలి కార్యక్రమంగా నిర్వహించిన భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు కళ తప్పాయి. బందరు మండలం రుద్రవరం గ్రామంలో అన్ని హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న విశ్వ విద్యాలయం కార్యకలాపాలు ఈ నెల 31వతేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలను కొత్త క్యాంపస్‌లో నిర్వహించాలని విశ్వ విద్యాలయం అధికారులు నిర్ణయించారు. అయితే తొలిగా నిర్వహించే వేడుకలు అట్టహాసంగా జరుగుతాయని అంతా భావించారు. కానీ ఎటువంటి హంగూ అర్భాటం లేకుండా పేలవంగా వేడుకలను నిర్వహించి విశ్వ విద్యాలయం అధికారులు మమ అనిపించారు. హంగూ అర్భాటం పక్కన పెడితే కనీసం జాతీయ జెండాలతో కూడా చిన్నపాటి అలంకరణకు కూడా విశ్వ విద్యాలయం నోచుకోకపోవటం గమనార్హం. వేడుకల నిర్వహణలో ఎక్కడా కూడా జాతీయ భావం, దేశభక్తి ఉట్టి పడలేదు. బూజు పట్టిన విశ్వ విద్యాలయం పోట్కో కింద ఎటువంటి వేదిక లేకుండానే గచ్చు నేల మీద సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వ విద్యాలయం బయట ఏర్పాటు చేసిన స్థూపం వద్ద ఉపకులపతి ఆచార్య చంద్రశేఖర్ పతాకావిష్కరణ చేశారు. వేడుకలను చూసేందుకు గాను కేవలం ఇంజనీరింగ్ విద్యార్థులను మాత్రమే ఓ ప్రైవేట్ కళాశాల బస్సులో తీసుకు వచ్చారు. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందితో పాటు మహా అయితే 30 మంది కూడా లేని ఇంజనీరింగ్ విద్యార్థులతో రిపబ్లిక్ డే వేడుకలు జరిగిపోయాయి. వీరి కోసం ప్రత్యేకంగా ఏమైనా ఏర్పాట్లు చేశారా అంటే అదీ లేదు. వేడుకలను చూసేందుకు వచ్చిన వారంతా మండుటెండలో విశ్వ విద్యాలయం బయట నిలబడాల్సి వచ్చింది. సాంస్కృతిక ప్రదర్శనల విషయంలో కూడా అధికారులు తగు చర్యలు తీసుకోకపోవడం విశేషం. ఒకే బృందంతో రెండు మూడు కూచిపూడి నృత్యాలను ప్రదర్శింప చేశారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉండటంతో వేడుకలు చూసేందుకు వచ్చిన విద్యార్థులు పట్టుమని పది నిమిషాలు వారి వారి స్థానాల్లో నిలబడలేకపోయారు. అతిధులు ప్రసంగాలు చేస్తున్న సమయంలో విద్యార్థులు విశాలంగా ఉన్న క్యాంపస్ ఆవరణలో తలోదిక్కుకు వెళ్లి పోయి సెల్ఫీలు దిగుతూ సరదాగా కనిపించడం విశేషం. ఏది ఏమైనా కొత్త క్యాంపస్‌లో తొలిసారిగా, తొలి కార్యక్రమంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత పేలవంగా జరగడంతో విశ్వ విద్యాలయం అధికారులు అబాసుపాలయ్యారనే చెప్పవచ్చు.