కృష్ణ

టీ విక్రయిస్తూ నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని కోరుతూ అఖిలపక్షం పార్టీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా సోమవారం టీ విక్రయిస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కె వెంకటేశ్వరరావు, రాంప్రసాద్, భీమయ్య, దిడ్ల వీరరాఘవులు తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ అవార్డు గ్రహీత
ఎంపీడీవో ప్రసాద్‌కు సన్మానం
చల్లపల్లి, జనవరి 27: విధి నిర్వహణలో అంకితభావంతో సేవలందించే ఉద్యోగులను ప్రభుత్వం గుర్తించి అవార్డులు అందిస్తోందని పంచాయతీ రాజ్ మినిస్ట్రీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు పి బ్రహ్మానందరావు అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఎఎల్‌ఆర్‌కె ప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎంపీడీవో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎఓ నీరజాక్షి, ఏపీ ఎన్జీఓస్ చల్లపల్లి శాఖ ప్రధాన కార్యదర్శి ముదిగొండ తేజస్వి, కె వౌనిక తదితరులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన మోపిదేవి ఆలయం
మోపిదేవి, జనవరి 26: మండల కేంద్రం మోపిదేవిలో వేంచేసియున్న శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేటి నుండి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు జరగనున్నాయి. తొలి రోజైన మంగళవారం మాఘ శుద్ద చవితిని పురస్కరించుకుని ఉదయం 11గంటలకు స్వామివారిని పెండ్లి కుమారుడిని చేయనున్నారు. రెండవ రోజైన బుధవారం సాయంత్రం 3గంటలకు స్వామివారి శేష వాహనంపై గ్రామోత్సవం, రాత్రి 7గంటలకు ఎదుర్కోలు ఉత్సవం, 8గంటలకు స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవం, నంది వాహనంపై గ్రామోత్సవం నిర్వహించనున్నారు. మూడవ రోజైన గురువారం రాత్రి 8గంటలకు స్వామివారి రథోత్సవం, నాల్గవ రోజైన శుక్రవారం నీరాజన మంత్రపుష్పం, ఉదయం 9గంటలకు వసంతోత్సవం, పూర్ణాహుతి, సాయంత్రం 3గంటలకు వేద విద్వత్ సభ, పండిత సత్కారం, రాత్రి 7గంటలకు సెమీవృక్ష పూజ, 8గంటలకు మయూర వాహనంపై గ్రామోత్సవం, ఐదవ రోజైన శనివారం ఉదయం 10గంటలకు సుబ్రహ్మణ్య హవనం, రాత్రి 7గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు, పుష్పశయ్యాలంకృత పర్యంక సేవ, తీర్దప్రసాద వినియోగంతో కార్యక్రమాలు ముగియనున్నాయని చల్లపల్లి ఎస్టేట్ ఆలయాల అసిస్టెంట్ కమిషనర్ లీలాకుమార్ తెలిపారు. ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా 28వ తేదీ రాత్రి 6గంటలకు భక్తి రంజని పాటల కార్యక్రమం, 8గంటలకు కూచిపూడి నాట్యం, బుధవారం భక్తి గాన సుధ, గయోపాక్యానం, సత్యహరిశ్చంద్ర ఏకపాత్రాభినయం, గురువారం భక్తి గానామృతం, చింతామణి నాటక ప్రదర్శన, శుక్రవారం భరతనాట్యం, భక్తి పాటలు, సత్యహరిశ్చంద్ర నాటక ప్రదర్శన నిర్వహించబడతాయని ఏసీ తెలిపారు.