కృష్ణ

అర్హతల విషయంలో మరో అవకాశాన్ని వినియోగించుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం(కోనేరుసెంటర్): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు విషయంలో అర్హులు కాని వారికి ప్రభుత్వం ఇచ్చిన మరో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) కోరారు. గురువారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుండి తమ సమస్యలు చెప్పుకునేందుకు మంత్రి పేర్ని నివాసానికి వచ్చారు. వారి సమస్యలను ఓపిగ్గా విన్న మంత్రి పేర్ని సంబంధిత సమస్యలకు పరిష్కార చర్యలు చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెన్షన్, రేషన్ వంటి సంక్షేమ పథకాల అర్హుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మరో అవకాశాన్ని ఇచ్చారన్నారు. అర్హతలకు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను రీ వెరిఫికేషన్‌లో అధికారులకు తెలియజేసి సంక్షేమ ఫలాలు అందుకోవాలని సూచించారు.

అమర ప్రేమకు సజీవ సాక్ష్యం
‘సెయింట్ మేరీస్ చర్చి’
మచిలీపట్నం(కల్చరల్), ఫిబ్రవరి 13: తరతరాల ప్రాచీన చరిత్ర, స్వాతంత్య్ర పోరాట పటిమ కలిగిన జిల్లా కేంద్రం మచిలీపట్నం అమర ప్రేమికులకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ముంతాజ్- షాజహాన్ ప్రేమకు తార్కాణంగా తాజ్‌మహల్ నిలిచినట్టు నగరంలోని సెయింట్ మేరీస్ చర్చి జాన్ పీటర్ - అరబెల్లాల ప్రణయ చిహ్నంగా ‘బందరు తాజ్‌మహాల్’గా ప్రఖ్యాతిగాంచింది. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సెయింట్ మేరీస్ చర్చి (బందరు తాజ్‌మహల్)తో పాటు దాని వెనుక ఉన్న జాన్ పీటర్ - అరబెల్లా ప్రేమ కథను ఒకసారి పరిశీలిద్దాం. సుమారు 213 సంవత్సరాల క్రితం 18వ శతాబ్దం ప్రారంభంలో ఆంగ్లేయ సైనికులు బందరుకోట ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకుని ఉండేవారు. మచిలీపట్నం ఓడరేవు పట్టణం కావడంతో పాశ్చాత్య దేశాలతో ఎగుమతులు, దిగుమతులు విరివిగా జరుగుతుండేవి. ఫ్రెంచ్, డచ్, బ్రిటీష్ వారు కాలనీలుగా మచిలీపట్నంలో నివాసం ఉండేవారు. క్రైస్తవ సమూహం కోసం సెయింట్ జాన్ ది డివైన్ చర్చి ఉండేది. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన అధికారులు అక్కడ క్రీస్తును ఆరాధించేవారు. వారిలో రాబిన్‌సన్ అనే కెప్టెన్ ఉండేవాడు. ఆయనకు అరబెల్లా అనే అందమైన కుమార్తె ఉండేది. అదే సమయంలో బందరు ఓడరేవుకు జాన్ పీటర్‌ను మేజర్ జనరల్‌గా బ్రిటీష్ ప్రభుత్వం నియమించింది. బ్రిటీష్ ఉన్నతాధికారుల ఆత్మీయ కలయిక తరచుగా జరుగుతుండేది. ఒకనాటి విందులో అరబెల్లా, జాన్ పీటర్ ఒకరినొకరు చూసుకున్నారు. తొలి చూపులోనే వారి మధ్య ప్రేమ మొలకెత్తింది. ప్రేమ బంధంలో మునిగి తేలుతున్న అరబెల్లా, పీటర్‌ల కథ విషాదంగా ముగిసింది. అరబెల్లా తండ్రి రాబిన్‌సన్ వారి పెండ్లికి ఒప్పుకోలేదు. అంతే కాకుండా అరబెల్లాను బలవంతంగా ఇంగ్లాండ్‌కు పంపించాడు. కాలగమనంలో నాలుగేళ్లు గడిచిపోయినా అరబెల్లా జాన్‌పీటర్‌ను మర్చిపోలేకపోయింది. మానసిక వేదనతో కృంగిపోయింది. పీటర్ కూడా కృంగిపోయాడు. నిరాసక్తత చోటు చేసుకుంది. తన మనస్సుకు తాను ఒక మేజర్ జనరల్ మాత్రమే అని సర్ది చెప్పుకుని యాంత్రికంగా విధులు నిర్వర్తించేవాడు. తండ్రి మనస్సు ఎన్నటికీ కరగదని నిర్ణయించుకున్న అరబెల్లా పీటర్‌ను పెండ్లి చేసుకోవాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఇంగ్లాండ్ నుంచి కట్టుబట్టలతో బందరు నగరానికి వచ్చేసింది. అందరు ఆడ పిల్లల వలే ఎన్నో కలలను అరబెల్లా కన్నది. అరబెల్లా నిర్ణయం తెలుసుకున్న పీటర్ ఆనందానికి అవధులు లేవు. ఆమె కోరిక మేరకు వివాహానికి లండన్ నుంచి వజ్రాలు పొదిగిన వెడ్డింగ్ గౌను, డైమండ్ రింగ్ తెప్పించాడు. వారం రోజుల్లో పెండ్లి జరుగుతుందని పీటర్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు. పట్టరాని సంతోషంతో అరబెల్లా ఆహారం తీసుకోలేకపోయింది. ఆహారం లేక రోజులు గడచేకొద్ది మలేరియా జ్వర లక్షణాలు, నిరసం కారణంగా మంచం పట్టిన ఆమె 1809వ సంవత్సరం నవంబర్ 6వ తేదీన తుది శ్వాస విడిచింది. ఆమెకు ఏమీ చేయలేకపోయానన్న బాధతో కృంగిపోయిన పీటర్ అరబిల్లా పార్థివ దేహానికి వందల యేళ్లు చెక్కు చెదరకుండా ఉండేందుకు రసాయనాలు పూసి వెడ్డింగ్ గౌను వేసి ఉంగరాన్ని తొడిగాడు. నాటి క్యాతలిక్ పండితులు ఆమెను ఖననం చేయడానికి అనుమతించ లేదు. అమితంగా ఆమెను ప్రేమించిన పీటర్ తన విలువైన ఆస్తులను అమ్మేసి రూ.18వేలను వెచ్చించి ఆమె స్మారకార్ధం చర్చిని నిర్మించాడు. గాజు పేటికలో ఆమె శరీరాన్ని ఉంచి సమాధి చేశాడు. ఆమెను చూడాలనుకునేటప్పుడు గాజు పెట్టే పైకి వచ్చే ఏర్పాటు చేశాడు. పది అడుగుల ఎత్తులో గోడకు ఒక చెక్కతో తయారు చేసిన పావురం బొమ్మను అమర్చాడు. ఆ చెక్క పావురాన్ని తిప్పితే శవపేటిక పైకి వచ్చేది. ప్రతి రోజూ కనీసం ఒక సారైనా ఆమె సమాధి వద్దకు వచ్చి ఆమెను తనివి తీరా చూసుకునేవాడు. చెన్నైకు బదిలీ అయ్యే వరకు ప్రతి రోజూ అరబెల్లాను చూసి గుండెలవిసేలా రోదించేవాడు. చివరకు చెన్నైకు బదిలీ అయ్యాడు. అరబెల్లా లేని జీవితం నిరర్థకమని భావించిన పీటర్ చెన్నై నగరంలో ఎక్కువ కాలం జీవించలేకపోయాడు. 1817లో తుది శ్వాస విడిచాడు. చెన్నై నగరంలో నేటికీ పీటర్ జ్ఞాపక చిహ్నంగా ఒక పార్కు ఉంది. మచిలీపట్నం, చెన్నై నగరాలు అరబెల్లా, పీటర్‌ల అమర ప్రేమకు సజీవ సాక్షాలుగా నిలిచాయి. 1842లో బందరులోని చర్చిని సెయింట్ మేరీస్ చర్చిగా పేరు మార్చారు. ఆ చర్చిలో నేటికీ పీటర్ అమర్చిన పావురం బొమ్మ, పాలరాతి పలకం కనిపిస్తాయి. 1960 దశకంలో చర్చిలో సున్నాలు వేసే సమయంలో పావురాన్ని తిప్పితే శవపేటిక పైకి వస్తుందని తెలియని ఒక కార్మికుడు పావురాన్ని పట్టుకుని తిప్పాడు. ఒక్కసారిగా గాజుపెట్టే పైకి వచ్చి సమాధి తెరుచుకుంది. అరబెల్లా పార్దీవ దేహాన్ని చూసిన కార్మికుడు అక్కడికక్కడే గుండె ఆగి చనిపోయాడు. దానికి స్పందించిన కలెక్టర్ ఆ ఫలకాన్ని శాశ్వతంగా మూయించాడు. బందరు తాజ్‌మహల్‌గా పేరుగాంచిన సెయింట్ మేరీస్ చర్చి విషాద ప్రేమకు సజీవ సాక్ష్యంగా దర్శనమిస్తోంది.