కృష్ణ

జగన్ పాలనలో మైనార్టీలకు సైతం నామినేటెడ్ పదవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలిదిండి: కలిదిండి మార్కెట్ యార్డు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి సమాన్యుడికి మార్కెట్ యార్డు పదవి ఇవ్వడం సీఎం జగన్ పరిపాలనకు నిదర్శనమని పెనమలూరు శాసనసభ్యుడు కొలుసు పార్థసారథి అన్నారు. గురువారం కలిదిండి మార్కెట్ యార్డు చైర్మన్‌గా నీలపాల వెంకటేశ్వరరావుచే ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సారథి మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గంలో రెండు ఎఎంసీ పదవులకు బీసీలకే కేటాయించటం చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఉందన్నారు. ఎఎంసీ వైస్ చైర్మన్‌గా బొర్రా శేషుబాబు, డైరెక్టర్‌గా మేడిశెట్టి ఉమా, వి బలరామరాజు, మహ్మద్ సర్దార్ ఉన్నీసా, రేవు నరసింహారావు, కందుల వెంకట లక్ష్మి, గద్దే హేమమణి, కలిదిండి వెంకటలక్ష్మి, కల్లా గణపతి, కోరం అనూరాధ, కాండ్రాక చిన్నమ్ములు, పెనుమాల అంజనీదేవి, ఎం మధుసూధనరావు, పి ప్రసాదరావు, మేకా రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కోటగిరి శ్రీ్ధర్‌బాబు, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్), పుప్పాల శ్రీనివాసరావు, వైకాపా నాయకులు నంబూరి శ్రీదేవి, కందుల వెంకటేశ్వరరావు, ఎస్‌కె ఛాన్, నంబూరి బాబి తదితరులు పాల్గొన్నారు.

నివేశన స్థలాల ఎంపికపై గొడవ సమస్యకు పరిష్కారం
కోడూరు, ఫిబ్రవరి 13: ప్రభుత్వం పేదలకు నివేశన స్థలాలు పంపిణీ చేయడానికి కృతనిశ్చయంతో పని చేస్తుండగా అందుకు రెవెన్యూ యంత్రాంగం ఉరుకులు, పరుగులు పెడుతోంది. దింటిమెరక గ్రామంలోని ఆర్‌ఎస్ నెం. 892/2లో మూడు ఎకరాల 74 సెంట్ల భూమిలో ముళ్ల చెట్లను నరికివేయటం, చదును చేసే పనులకు కోడూరు రెవెన్యూ అధికారులు గురువారం సమాయమత్తమయ్యారు. గ్రామస్థులు ఆ భూమి మా తాతది, శిస్తు కడుతున్నాం అని అడ్డం తిరగటంతో పోలీసులను ఆశ్రయించాల్సి వస్తోంది. కోడూరు ఎస్‌ఐ పి రమేష్ రంగంలోకి దిగి గ్రామస్థులను ఒక చోట చేర్చి పెద్దల సమక్షంలో ఆ భూమి మీదే అన్నట్లుగా ఆధారాలు ఉంటే తీసుకురమ్మని సూచించారు. గత ప్రభుత్వాలు అప్పటి యంత్రాంగం, అధికారులు ప్రభుత్వ స్థలాలకు కూడా గ్రామాలలోని కొంత మంది కుల పెద్దలు తమ కుటుంబ సభ్యుల పేరుతో శిస్తు రసీదులు చెల్లించి వాటిని అడ్డం పెట్టుకుని ఆ భూమిపై హక్కులు ఉన్నాయని వాదించటం మొదలు పెట్టారు. ప్రభుత్వ భూములకు శిస్తులు కట్టి ఈ రోజు మాదేనంటే చెల్లదు ఇంకా ఇప్పుడు గొడవ చేయడం సరికాదన్నారు. వారిలో ఇళ్ల స్థలాలు మంజూరై అర్హులుగా ఉంటే వారికి ఇక్కడే కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు వెనక్కి తిరిగారు. మొత్తం 3.70 సెంట్ల విస్తీర్ణంలో భూమి చిట్టడవిని తలపిస్తుండగా జెసీబీలు చెట్లను తొలగించే పనులు చేస్తున్నాయి. వీఆర్‌ఓలు మహ్మద్ అన్సారీ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.