కృష్ణ

మహాత్మ గాంధీ చూపిన బాటే అనుసరణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం(కల్చరల్): జాతిపిత మహాత్మ గాంధీ చెప్పిన విధంగా విద్యార్థులంతా అసత్యం, హింసకు దూరంగా ఉండి తమ జీవితాలను మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. శనివారం అట్టహాసంగా నిర్వహించిన స్థానిక గాంధీ విద్యాలయ స్వర్ణోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)తో కలిసి వేడుకలకు హాజరైన జాస్తి చలమేశ్వర్ విద్యార్థులనుద్దేశించి సందేశాత్మక ప్రసంగం చేశారు. బాల్యంలో జరిగిన సంఘటనల ప్రభావం మన జీవితంపై ఎంతగానో ఉంటుందన్నారు. నేడు ప్రపంచీకరణ వల్ల కార్పొరేట్ విద్యకు ఆకర్షణ పెరిగిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా స్థాపితమైన గాంధీ విద్యాలయం స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పెద్దలను గౌరవించే సంప్రదాయాన్ని ఏ ఒక్కరూ మరువరాదన్నారు. అభిప్రాయ భేదాలు మానవ సహజం చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుందని, హింసకు తావు లేకుండా గాంధీజీ చూపిన బాట అనుసరణీయమన్నారు. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ప్రతి ఒక్కరి బాల్యంలో జ్ఞాపకాలు చనిపోయే వరకు గుర్తుంటాయన్నారు. తన ప్రాథమిక విద్య ఇదే పాఠశాలలో కొనసాగిందంటూ తన బాల్యంలోని జ్ఞాపకాలను మంత్రి గుర్తుకు తెచ్చుకున్నారు. తన వ్యక్తిత్వ వికాసానికి గాంధీ విద్యాలయం పునాది వేసిందన్నారు. పూర్వ విద్యార్థిగా పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి, సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయిని రమావిలాసంను ఘనంగా సత్కరించారు. పాఠశాల సావనీర్‌ను ఆవిష్కరించారు. తొలుత పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మించిన గోల్డెన్ జూబ్లీ భవనాన్ని జస్టిస్ జాస్తి చలమేశ్వర్, గ్రంథాలయాన్ని మంత్రి పేర్ని నాని ప్రారంభించారు. గత సంవత్సరం 10/10 జీపీఎ సాధించిన ఇద్దరు విద్యార్థులు, పాఠశాల అభివృద్ధికి విరాళాలు అందజేసిన వారికి మెమెంటోలు అందజేసి సత్కరించారు. గాంధీ విద్యాలయం కరస్పాండెంట్ గుడివాడ వెంకట గున్నయ్యశెట్టి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హిందూ కళాశాల పాలకవర్గ చైర్మన్, మచిలీపట్నం మాజీ పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు, బెల్ కంపెనీ జీఎం డి రవి ప్రసాద్, ఎల్‌ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ పి సూర్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, పాఠశాల పాలకవర్గ ఉపాధ్యక్షులు ఎన్ దుర్గామల్లేశ్వరరావు, కారుమూరి రాజేంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి గుడివాడ మెహర్ ప్రసాద్, కార్యదర్శి కొప్పర్తి రవి శంకర్, సంయుక్త కార్యదర్శి మామిడి ధనరత్నారావు, కోశాధికారి జెవిఎన్ భానుప్రకాష్, లైబ్రరరీ కార్యదర్శి వూర సురేంద్రరావు, హెచ్‌ఎం విజయలక్ష్మి శ్రీనివాస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.