కృష్ణ

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రజా చైతన్య యాత్ర ద్వారా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతామని శాసనమండలి సభ్యుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు తెలిపారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజా చైతన్య యాత్రలకు సంబంధించిన వివరాలను అర్జునుడు తెలియజేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఈ నెల 17వతేదీ నుండి జిల్లాలో ప్రజా చైతన్య యాత్రలకు శ్రీకారం చుట్టామన్నారు. జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రజా చైతన్య యాత్రల నిర్వహణకు రూపకల్పన చేశామన్నారు. ఈ ప్రజా చైతన్య యాత్రల ద్వారా గత తెలుగుదేశం పాలనా విధానాలను వివరించటంతో పాటు ప్రస్తుత వైసీపీ పాలనా వైఫల్యాలను ఎండగడతామన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దుర్వినియోగం చేస్తున్నారన్నారు. కేవలం ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకే సీఎం జగన్ సమయం కేటాయిస్తున్నారన్నారు. ఇటీవల దేశ వ్యాప్తంగా జరిగిన ఐటీ దాడులను సైతం చంద్రబాబుకు అంటగట్టే ప్రయత్నం చేశారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పీఎస్‌గా పని చేసిన శ్రీనివాస్ వద్ద ఐటీ దాడుల్లో దొరికింది గోరంత అయితే వైసీపీ నాయకులు కొండంతగా చూపించే ప్రయత్నం చేశారన్నారు. రూ.2వేల కోట్లు అవినీతి సొమ్ము దొరికిందని గగ్గోలు పెట్టిన వైసీపీ నేతలకు ఐటీ అధికారుల పంచనామా రిపోర్టు కనువిప్పు చేసిందన్నారు. జగన్ తొమ్మిది నెలల పాలనలో రాష్ట్ర ఆదాయం 13 శాతానికి పడిపోయిందని ఆరోపించారు. 69శాతం మూలధనం, వ్యయం రాష్ట్రంలో తగ్గిపోయాయని, 16 శాతం అప్పులు పెరిగాయన్నారు. గ్రామ వలంటీర్లు ఏకపక్షంగా 7లక్షలు పెన్షన్‌లను తొలగించారన్నారు. సంపదను విధ్వంసం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని మండిపడ్డారు. అవగాహన లేక అమరావతి నిర్మాణంపై అవివేకంగా ప్రభుత్వం ప్రవర్తిస్తుందన్నారు. ఐటీ దాడుల్లో వైకాపా నేతల బాగోతాలు బయటకు రాకుండా ఢిల్లీ చుట్టూ తిరుగుతూ రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నారని అర్జునుడు ధ్వజమెత్తారు.

ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో డాక్టర్స్ టీంపై జర్నలిస్ట్‌ల విజయం
మచిలీపట్నం(కల్చరల్), ఫిబ్రవరి 16: స్థానిక ఆంధ్ర జాతీయ క్రీడా మైదానంలో ప్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో డీసెంట్ డాక్టర్స్ జట్టుపై జర్నలిస్ట్ వారియర్స్ విజయం సాధించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్ మ్యాచ్‌ను ప్రారంభించగా విజేతగా నిలిచిన జర్నలిస్ట్ వారియర్స్‌కు ఎఎస్పీ మోకా సత్తిబాబు ట్రోఫీని అందజేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన డీసెంట్ డాక్టర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు గాను ఏడు పరుగుల నష్టానికి 121 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన జర్నలిస్ట్ వారియర్స్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి తొమ్మిది ఓవర్లకే విజయలక్ష్యాన్ని ఛేదించింది.

పెడన జడ్పీహెచ్‌ఎస్‌లో సస్పెన్షన్‌ల పరంపర
* హెచ్‌ఎం జ్యోతిని సైతం సస్పెండ్ చేసిన ఆర్‌జేడీ * ఇప్పటికే ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు
పెడన, ఫిబ్రవరి 16: స్థానిక భట్ట జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించి ఉపాధ్యాయులపై సస్పెన్షన్‌ల పరంపర కొనసాగింది. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు బోధనాంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా విధి నిర్వహణలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న విద్యార్థుల ఆరోపణల నేపథ్యంలో రెండు రోజుల క్రితమే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు కె హనుమంతరావు, అశోక్‌లను జిల్లా విద్యా శాఖాధికారిణి ఎంవి రాజ్యలక్ష్మి సస్పెన్షన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం జ్యోతిపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. బందరు ఉప విద్యాశాఖాధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా జ్యోతిని సస్పెండ్ చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ కాకినాడ ఆర్‌జేడీ ఆర్ నరసింహరావు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.