కృష్ణ

కృష్ణా వర్సిటీ డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం(కల్చరల్): కృష్ణా విశ్వ విద్యాలయం, అనుబంధ కళాశాలలకు సంబంధించి అండర్ గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) ఐదవ సెమిష్టర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. బందరు మండలం రుధ్రవరంలోని కృష్ణా విశ్వ విద్యాలయం సొంత క్యాంపస్‌లో సెమిష్టర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఉపకులపతి ఆచార్య కెబి చంద్రశేఖర్, రిజిస్ట్రార్ ఆచార్య కె కృష్ణారెడ్డిలు ఆదివారం విడుదల చేశారు. గత సంవత్సరం ఐదవ సెమిష్టర్ పరీక్షా ఫలితాలతో చూస్తే ఈ విడత ఫలితాలు స్వల్పంగా పెరిగాయి. 2018-19 సంవత్సరానికి సంబంధించి 50.86 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ప్రస్తుతం 52.27శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 1.41శాతం మేర మాత్రమే ఉత్తీర్ణత స్వల్పంగా పెరగడం విశేషం. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య కెబి చంద్రశేఖర్ మాట్లాడుతూ బీఎ, బీబీఎ, బీసీఎ, బీకాం, బీకాం (కంప్యూటర్స్), బీఎస్‌సీ, బీఎస్‌సీహెచ్ అండ్ హెచ్‌ఎ కోర్సులకు సంబంధించి ఐదవ సెమిష్టర్ పరీక్షలకు మొత్తం 10వేల 657 మంది హాజరు కాగా 5వేల 570 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. ఉత్తీర్ణతలో బాలికలే పై చెయ్యి సాధించారన్నారు. 63.86 శాతం మేర బాలికలు ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. బీసీకు సంబంధించి 401 మందికి గాను 334 మంది (83.23శాతం), బీబీఎకు సంబంధించి 203 మందికి గాను 159 మంది (78.33శాతం), బీసీఎకు సంబంధించి 31 మందికి గాను 17 మంది (54.84శాతం), బీసీఎంహెచ్‌కు సంబంధించి 80 మందికి గాను 79మంది (98.75శాతం), బీకాంకు సంబంధించి 1330 మందికి గాను 866 మంది (65.11శాతం), బీకాం (కంప్యూటర్స్)కు సంబంధించి 3071 మందికి గాను 1205 మంది (39.24శాతం), బీఎస్సీకు సంబంధించి 5,417 మందికి గాను 2815 మంది (51.97శాతం), బీఎస్‌సీహెచ్‌అండ్‌హెచ్‌ఎకు సంబంధించి 124 మందికి గాను 95 మంది (76.61 శాతం) ఉత్తీర్ణులయ్యారన్నారు. పునః మూల్యాంకనంకు సంబంధించి ఈ నెల 22వతేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 18వతేదీన మూడవ సెమిష్టర్, 19వతేదీన 1వ సెమిష్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నట్టు తెలిపారు. మరో వారం రోజుల్లో మూడవ సెమిష్టర్ పరీక్షా ఫలితాలను కూడా విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో పరీక్షల విభాగం కో-ఆర్డినేటర్ డా. జయశంకర ప్రసాద్, యూజీ కో-ఆర్డినేటర్ డా. విజయ కుమారి, మీడియా సెల్ పీఆర్‌ఓ డా. బ్రహ్మాచారి, పరీక్షా ఫలితాల ప్రాసెసింగ్ విభాగం సిబ్బంది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.