కృష్ణ

ఒకొక్కటిగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: వర్గ విభేదాలు, ఆధిపత్య పోరుకు కేంద్ర బింధువుగా ఉన్న కృష్ణా విశ్వ విద్యాలయం ప్రక్షాళనకు ఉపకులపతి ఆచార్య కెబి చంద్రశేఖర్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల్లోనే చంద్రశేఖర్ విశ్వ విద్యాలయంలో నెలకొన్న లోటుపాట్లపై దృష్టి సారించారు. బాధ్యతలు స్వీకరించిన పక్షం రోజుల్లోనే అద్దె భవంతుల్లో కొనసాగుతున్న విశ్వ విద్యాలయాన్ని బందరు మండలం రుధ్రవరం గ్రామంలో 102 ఎకరాల విస్తీర్ణంలో అన్ని హంగులతో నిర్మించిన సొంత భవనంలోకి అడుగు పెట్టించారు. కొత్త క్యాంపస్‌లోకి అడుగు పెట్టక ముందే విశ్వ విద్యాలయం పరిపాలనా పదవుల్లో భారీగా మార్పులు తీసుకు వచ్చి ఆయా పరిపాలనా విభాగాలను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విశ్వ విద్యాలయం అభివృద్ధికి ఆయన తీసుకుంటున్న చర్యలు ఒకొక్కటి కార్యరూపం దాలుస్తున్నాయి. విశ్వ విద్యాలయం సర్వతోముఖాభివృద్ధికి ఎంతగానో దోహదపడే 12బి గుర్తింపు ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే తీసుకు వస్తానంటున్న ఉపకులపతి ఆచార్య కెబి చంద్రశేఖర్ విశ్వ విద్యాలయం అభివృద్ధికి, విద్యా ప్రమాణాలకు తీసుకుంటున్న చర్యలను ఆదివారం ఈ ప్రతినిధికి వివరించారు.
12బీ గుర్తింపుతో రీసెర్చ్ కార్యకలాపాలు
విశ్వ విద్యాలయం రీసెర్చ్ కార్యకలాపాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. ఇందుకు ప్రధాన కారణం 12బి గుర్తింపు లేకపోవడమేనన్నారు. 12బి గుర్తింపు లేనందున రీసెర్చ్ గ్రాంట్స్, ఇతర ఫండింగ్ ఏజెన్సీల నుండి నిధులు రావడం లేదన్నారు. దీన్ని అధిగమించేందుకు గాను విశ్వ విద్యాలయానికి 12బి గుర్తింపు దిశగా కృషి చేస్తున్నట్టు తెలిపారు.
హాస్టల్స్ నిర్మాణంతో అడ్మిషన్స్ పెంచుతాం
ఏ విశ్వ విద్యాలయానికైనా అడ్మిషన్స్ పెరగాలంటే సంబంధిత విశ్వ విద్యాలయంలో వసతి గృహాల ఏర్పాటు అత్యవసరమన్నారు. కృష్ణా వర్సిటీకి వసతి గృహాలు లేకపోవడాన్ని తాను బాధ్యతలు స్వీకరించిన తొలి రోజునే గుర్తించానన్నారు. వసతి గృహాలు లేనందున ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. త్వరలో జరిగే విశ్వ విద్యాలయం పాలక మండలి సమావేశంలో హాస్టల్స్ నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వ నిధులు లేదా ఇంటర్నల్ నిధులతో హాస్టల్స్ నిర్మాణం చేపడతామన్నారు. బాల బాలికలకు వేర్వేరుగా హాస్టల్స్ నిర్మాణం చేస్తామన్నారు. 50-50 గదులతో 400 నుండి 500 మంది విద్యార్థులకు వసతి కల్పించే విధంగా వసతి గృహాల రూపకల్పన ఉంటుందన్నారు.
నూజివీడు పీజీ సెంటర్ విస్తరణకు సైతం చర్యలు
నూజివీడులోని డా. ఎంఆర్‌ఆర్ పీజీ సెంటర్‌లోని అకడమిక్ బ్లాక్‌ను కూడా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రెండు ఫ్లోర్‌లలో ఉన్న అకడమిక్ బ్లాక్‌ను మరింత విస్తరిస్తామన్నారు. అలాగే హాస్టల్ వసతి విద్యార్థులకు సరిపోవడం లేదని, ప్రస్తుతం ఉన్న హాస్టల్ పైనే మరో రెండు అంతస్తులు నిర్మించేందుకు గాను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్టు తెలిపారు.
పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేశాం
విశ్వ విద్యాలయం ఏర్పాటైన నాటి నుండి అధ్యాపకుల పదోన్నతుల విషయంలో కొంత అసంతృప్తి అధ్యాపకుల నుండి కనిపిస్తోందన్నారు. దీనిపై కూడా తాను దృష్టి పెట్టి యూనివర్శిటీ గ్రాండ్స్ కమిషన్ మార్గదర్శకాల మేరకు పదోన్నతుల ప్రక్రియను దాదాపు పూర్తి చేశామన్నారు. త్వరలో జరగబోయే పాలక మండలి సమావేశంలో పదోన్నతులకు ఆమోద ముద్ర పడనుందన్నారు.