కృష్ణ

సంక్షేమ పథకాలకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు: ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల కాలంలోనే సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికే దక్కుతుందని పెడన నియోజకవర్గ శాసనసభ్యుడు జోగి రమేష్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని పోసినవారిపాలెం గ్రామంలో నూతనంగా మంజూరైన బియ్యం కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల మండల అధ్యక్షుడు, పీఎసీఎస్ అధ్యక్షుడు తలుపుల వెంకట కృష్ణారావు, మాజీ ఎంపీటీసీ గొరిపర్తి రవి కుమార్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్ నాయుడు, సంగా మధుసూథనరావు, తహశీల్దార్ జె విమల కుమారి, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కృత్తివెన్ను శివాలయ ముఖ ద్వారానికి రూ.23లక్షలు
* ఎమ్మెల్యే జోగి రమేష్
కృత్తివెన్ను, ఫిబ్రవరి 17: జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ దుర్గా, పార్వతీ సమత నాగేశ్వర స్వామి అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని పెడన నియోజకవర్గ శాసనసభ్యుడు జోగి రమేష్ అన్నారు. నూతనంగా ఏర్పాటైన ఆలయ పాలకవర్గ సభ్యులచే సోమవారం ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. పాలకవర్గ చైర్మన్‌గా పట్టపు నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధి కోసం రూ.23లక్షలతో ఆలయ ముఖ ద్వారం, కోనేరు అభివృద్ధి, అభిషేక మండపం నిర్మించేందుకు ఆలయ ఇఓ శింగనపల్లి శ్రీనివాసరావు ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. మహా శివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ కొల్లాటి బాల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

పెదముత్తేవిలో నివేశన స్థలాల ప్లాట్ల విభజన
కూచిపూడి, ఫిబ్రవరి 17: మొవ్వ మండలం పెదముత్తేవి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ నివేశన స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ అధికారులు సేకరించిన భూమిని లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సోమవారం కొలతలు, విడగొట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. తహశీల్దార్ రాజ్యలక్ష్మి ఆదేశం మేరకు వీఆర్‌ఓ ఆరేపల్లి రవి, సచివాలయ సర్వేయర్ ఎం సత్య సోనియాలు సర్వే నెం.162/1లోని నాలుగు ఎకరాల 64 సెంట్లలో52 మంది లబ్ధిదారులకు నివేశన స్థలాలు, అంతర్గత రహదారుల నిర్మాణాలకు కావల్సిన స్థలాలను విడగొట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. ఉగాది నాటికి పూర్తి స్థాయిలో నివేశన స్థలాలు సిద్ధం చేసి పేదలకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వీఆర్‌ఓ ఆరేపల్లి రవి తెలిపారు.