కృష్ణ

విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు: విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానంలో ఉండగలమని ఎంఈఓ జి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో 88వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యతోనే ప్రతి విద్యార్థి భవిష్యత్తు నిర్మితమవుతుందన్నారు. గత 10వ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు రూ.1200 నగదు బహుమతి అందజేశారు. వార్షికోత్సం సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందర్ని అలరించాయి. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం వై ధనలక్ష్మి, పూర్య విద్యార్థుల సంఘం అధ్యక్షుడు గనే్న వెంకట్రావ్, ఎస్‌ఎంసి చైర్మన్ డి రమణ తదితరులు పాల్గొన్నారు.

రూ.2.13లక్షల పొగాకు ఉత్పత్తుల సీజ్
అవనిగడ్డ, ఫిబ్రవరి 17: నిషేధిత పొగాకు ఉత్పత్తులను విక్రయించడానికి తీసుకుని వెళుతున్న ముగ్గురు వ్యక్తుల నుండి రూ. 2లక్షల 13 వేలు విలువ గల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రమేష్‌రెడ్డి తెలిపారు. మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ గ్రామంలో దుకాణాలలో ఉంచి విక్రయిస్తున్న తటవర్తి మురళీకృష్ణ, మడిపల్లి నారాయణరావు, ఏచూరి కృష్ణమోహన్ నుండి ఉత్పత్తులను స్వాధీనం చేసుకోగా వారిని సోమవారం ఉదయం పులిగడ్డ సెంటరులో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరిని విచారించగా ఉయ్యూరు పట్టణానికి చెందిన కోపూరి కాంతారావు అనే వ్యాపారి మాకు కావల్సినప్పుడు సరుకు సరఫరా చేస్తాడని తెలిపారు. కాగా కాంతారావును అరెస్టు చేయాల్సి ఉందని, పై ముగ్గురు నుండి ఐదు సంచులలో ఉన్న సరుకును సీజ్ చేయటం జరిగిందని, నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ రవి కుమార్, ఎస్‌ఐ సందీప్ పాల్గొన్నారు.