కృష్ణ

రైతులకు అండగా భరోసా కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు: పంట సాగులో రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఏడీఏ సునీల్ పేర్కొన్నారు. మండలంలోని దేవరపల్లి, తోట్లవల్లూరు, పలుచోట్ల ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను ఏఓ కె శోభారాణితో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి నిపుణులు భరోసా కేంద్రాల్లో రైతులకు సూచనలు, సలహాలు తెలియజేస్తారని చెప్పారు. అదే విధంగా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయించడం జరుగుతుందన్నారు. వ్యవసాయోత్పత్తుల ధరలు అందుబాటులో ఉండటంతో రైతులు ధరల రూపేణ మోసపోయే అవకాశం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

పదవీ విరమణ చేసిన హోంగార్డుకు వన్ డే కాంట్రిబ్యూషన్ ఫండ్ అందజేత
మచిలీపట్నం(కోనేరుసెంటరు), ఫిబ్రవరి 18: పోలీసు శాఖలో సుదీర్ఘ కాలం పాటు హోంగార్డు విభాగంలో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ చేసిన హోంగార్డు టి మోహనాచారికి జిల్లాలో పని చేస్తున్న హోంగార్డులు అందరూ కలిసి ఒక రోజు వేతనాన్ని సేకరించగా వచ్చిన మొత్తం (వన్‌డే కాంట్రిబ్యూషన్ ఫండ్) మొత్తం రూ.4లక్షల 2వేల 570 చెక్కును మంగళవారం జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఏస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖకు హోంగార్డులు ఎనలేని సేవలందిస్తున్నారని, పదవీ విరమణ పొందినప్పటికీ పోలీసు శాఖాపరంగా ఎటువంటి సహాయ సహకారాలు పొందాలన్నా నేరుగా తమను కలువవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అడిషినల్ ఎస్పీ సత్తిబాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ధర్మేంద్ర, ఎఆర్ డీఎస్పీ సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ సీఐ చంద్రశేఖర్, హోంగార్డు విభాగపు ఆర్‌ఎస్‌ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.