కృష్ణ

టెండ‘రింగ్’పై సెంట్రల్, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై సెంట్రల్, స్టేట్ విజిలెన్స్ కమిషన్‌లకు ఫిర్యాదు చేస్తామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. స్థానిక జగన్నాథపురంలో ఎటువంటి వర్క్ ఆర్డర్ లేకుండా చేపట్టిన సీసీ రోడ్లను మంగళవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ రీ టెండరింగ్ పేరుతో అధికార పక్ష నాయకులు బందరు నియోజకవర్గంలో రూ.12కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో మంజూరైన 14వ ఆర్థిక సంఘం నిధులతో గత కౌన్సిల్ ఆమోదంతో పట్టణంలో డ్రైన్‌ల అభివృద్ధికి టెండర్లు పిలిచామన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్ సీపీ తాము పిలిచిన టెండర్లన్నింటినీ రద్దు చేసి ఆ నిధులను దారి మళ్లించి రోడ్ల నిర్మాణానికి వెచ్చిస్తోందన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పేర్ని నాని కాంట్రాక్టర్ల వ్యవస్థను తన ఆధీనంలోకి తీసుకుని టెండరింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. టెండర్లు పిలువకుండా, వర్క్ ఆర్డర్లు ఇవ్వకుండా మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణాలు చేస్తున్నారన్నారు. ఇందుకు అధికారులు సహకరిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. నియోజకవర్గంలో నిధుల దుర్వినియోగంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని సెంట్రల్, స్టేట్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు రవీంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ వైస్ చైర్మన్‌లు పంచపర్వాల కాశీ విశ్వనాథం (చంటి), పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఇలియాస్ పాషా, పిప్పళ్ల కాంతారావు, పార్టీ నాయకులు గనిపిశెట్టి గోపాల్, పివి ఫణికుమార్, అంగర తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు.