కృష్ణ

నివేశన స్థలాల పంపిణీకి రైతులు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు): నిరుపేదలకు ఇళ్ల స్థలాల కోసం భూముల అవసరం ఉందని రైతులకు నచ్చచెప్పాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. మంగళవారం మంత్రి తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యలతో వచ్చిన ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుని పరిష్కార చర్యలు చేపట్టారు. బందరు మండలం యాదర గ్రామం నుంచి వచ్చిన రైతులు ఇళ్ల స్థలాల కోసం తమకున్న కొద్దిపాటి భూములు తీసుకుంటున్నారని, మినహాయింపు ఇప్పించాలని కోరుతూ మంత్రికి విన్నవించగా ప్రభుత్వం ఉగాది నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 25లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందించాలనే లక్ష్యంతో ఉందన్నారు. ఈ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు భూముల సేకరణకు కృషి చేస్తున్నారని తెలిపారు. అయితే సేకరించే భూములు కేవలం పేదవారికి గూడు ఏర్పర్చాలనే ఉద్దేశ్యంతో మాత్రమే తీసుకుంటున్నారని, రైతుల నుండి బలవంతంగా తీసుకునే ఉద్దేశ్యం లేదని, రైతులు సహకరించాలని కోరారు.
దేశాయిపేటలో పేర్ని పర్యటన :
స్థానిక దేశాయిపేటలో మంత్రి పేర్ని నాని పర్యటించి అక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గంటాలమ్మతల్లిని మంత్రి దర్శించుకున్నారు. స్థానికంగా మంచినీటి సమస్య పరిష్కారానికి గడ్డి బజారులో నిర్మిస్తున్న ఓహెచ్‌ఎస్‌ఆర్ నిర్మాణం పూర్తి అయినప్పటికీ డిస్టిబ్యూషన్ పైపులైన్ కనెక్షన్స్ వెంటనే చేపట్టాలని ఓహెచ్‌ఎస్‌ఆర్ త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఇదే పేటలో గ్రామ సచివాలయనికి వెంటనే ప్రైవేటు భవనం చూడాలని మంత్రి ఆదేశించారు. ఇల్లులేని వారందరినీ ఇళ్ల స్థలాలు మంజూరు అర్హుల జాబితాలో చేర్చాలని సచివాలయ ఎడ్మిన్‌కు సూచించారు. మెప్మా ద్వారా చిరు వ్యాపారులకు మంత్రి గుర్తింపు కార్డులు అందజేశారు.