కృష్ణ

‘స్థానిక’ రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం చేస్తే ఉద్యమిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగితే ఉద్యమిస్తామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ప్రధాన ఓటు బ్యాంక్‌గా ఉన్న బీసీలను అన్ని విధాలా నష్టపర్చటంతో పాటు రాజకీయంగా దెబ్బతీసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కుట్రలు పన్నుతున్నారన్నారు. 50శాతం పైగా ఉన్న బీసీలకు 25శాతం మేర స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. గతంలో తాము 34 శాతం రిజర్వేషన్లు కల్పించామని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 9శాతం మేరకు బీసీలు రిజర్వేషన్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. 50శాతం రిజర్వేషన్లు దాటుతున్న పరిస్థితుల్లో వాస్తవ విషయాలను కోర్టుకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉండగా 34 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిధులను అమ్మఒడికి మళ్లించి ఆ వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఆదరణ పథకం కింద సొమ్ము చెల్లించిన బీసీలకు పని ముట్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయంబర్స్‌మెంట్ నిలిపి వేయటంతో కళాశాల యాజమాన్యాల ఒత్తిడికి విద్యార్థులు గురవుతున్నారన్నారు. నవరత్నాల కోసం బలహీన వర్గాలకు చెందిన నిధులను మళ్లిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. నేటి నుండి మచిలీపట్నంలో ప్రారంభం కానున్న ప్రజా చైతన్య యాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. మండలంలోని 34 గ్రామ పంచాయతీలు, కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్‌లలో పెద్ద ఎత్తున ప్రజా చైతన్య యాత్రలను నిర్వహిస్తామన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతుందన్నారు. ర్యాంప్‌లలో సీసీ కెమెరాలను బంద్ చేయించి జిల్లాకు చెందిన మంత్రులు ఇసుక దందాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ వైస్ చైర్మన్‌లు పంచపర్వాల కాశీ విశ్వనాథం (చంటి), బలగం విజయశేఖర్, పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఇలియాస్ పాషా, పిప్పళ్ల కాంతారావు, పార్టీ నాయకులు గనిపిశెట్టి గోపాల్, పివి ఫణికుమార్, పద్మనాభుని శేఖర్, అంగర తులసీదాస్, అబ్దుల్ అజీమ్, లంకిశెట్టి నీరజ, ఒడుగు ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.