కృష్ణ

మహిళా రక్షణకే తొలి ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మహిళల రక్షణే ప్రధాన కర్తవ్యంగా విధులు నిర్వర్తించాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు సూచించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బందరు, గుడివాడ, అవనిగడ్డ సబ్ డివిజన్‌లకు సంబంధించిన నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సబ్ డివిజన్‌ల వారీగా నమోదైన కేసులు, పరిష్కార చర్యలను ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల రక్షణ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకృత్యాలను పూర్తి స్థాయిలో రూపుమాపేందుకు గాను దిశ చట్టాన్ని తీసుకురావటంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ దిశ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మహిళలపై ఎటువంటి దాడులు జరగకుండా సిబ్బంది పని చేయాలని, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో మహిళా మిత్ర కమిటీలతో కలిసి విద్యా సంస్థలకు వెళ్లి దిశ, ఫోక్సో, నిర్భయ వంటి చట్టాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దిశ యాప్‌ను ప్రతి ఒక్కరూ వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో విద్యార్థులతో సైబర్ వారియర్స్ టీమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఇందు కోసం ముఖ్యమైన కళాశాలలకు డీఎస్పీ స్థాయి అధికారులు వెళ్లి వారికి వివరించాలని, మహిళలపై దాడులు జరిగిన నేపథ్యంలో ఫోక్సో, 376 ఐపీసీ కేసుల్లో నమోదైన సందర్భాలలో నేరస్థలానికి అందుబాటులో ఉన్న పోలీసు అధికారి వెళ్లి వివరాలు సేకరించినప్పుడే బాధిత మహిళలకు పూర్తి న్యాయం చేసిన వారవుతామన్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో విప్లవాత్మక మార్పులు సంభవించిన నేపథ్యంలో అమాయకులను అసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారన్నారు. ఈ సైబర్ నేరాల కట్టడికి సైబర్ క్రైం ఇనె్వస్టిగేషన్ మెరుగుపడాలని, ఇందు కోసం ఆధారాల సేకరణ సక్రమంగా నిర్వహించి కేసులను ఛేదించాలన్నారు. ప్రతి సబ్ డివిజన్‌లో సాంకేతిక నైపుణ్యం కలిగిన సిబ్బందితో ఒక టీంను ఏర్పాటు చేయాలన్నారు. ఎనిమిది సంవత్సరాలుగా ఎటువంటి నేరాలలో ప్రమేయం లేని రౌడీషీటర్లను వారిపై ఉన్న రౌడీషీట్లు తాత్కాలికంగా తొలగించేందుకు ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. ఇందులో వృద్దాప్యం, నేర చరిత్ర, ఆరోగ్యం ఆధారంగా వారి రౌడీషీట్లను తాత్కాలికంగా తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. సత్ప్రవర్తన లేకపోయినా, అతనిపై ఆరోపణలు వచ్చినా ఆ రౌడీషీట్లు మరలా తెరుస్తామన్నారు. అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు మాట్లాడుతూ పోలీసు సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసు కల్యాణ మండపాన్ని ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు. పోలీసు క్యాంటీన్‌ను కూడా మార్పులు చేసి సబ్సిడీ ధరకే సిబ్బందికి అల్పాహారం, భోజనం అందేలా చూస్తామన్నారు. హెచ్‌పీసీఎల్ వారి పోలీసు పెట్రోలు బంక్ కూడా నిర్మించేందుకు కసరత్తు ప్రారంభించామన్నారు. కో-ఆపరేటీవ్ సొసైటీలో కానిస్టేబుల్ స్థాయి నుండి డీఎస్పీ స్థాయి వరకు సభ్యత్వం కల్పించామన్నారు. ఈ సమావేశంలో మచిలీపట్నం, విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు మనోహా, రమణమూర్తి, ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ పూర్ణచంద్రరావు, ఎస్‌బీ డీఎస్పీ ధర్మేంద్ర, ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీలు విజయారావు, ఉమామహేశ్వరరావు, బందరు, గుడివాడ డీఎస్పీలు మొహబూబ్ బాషా, సత్యానందం, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ అజీజ్, సీసీఎస్ డీఎస్పీ మురళీకృష్ణ, ట్రైనీ డీఎస్పీలు శ్రావణి, రమ్య, మూడు డివిజన్‌లకు సంబంధించిన సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.