కృష్ణ

నిబంధనలకు లోబడి అర్హులందరికీ పెన్షన్: మంత్రి పేర్ని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం(కోనేరుసెంటర్): వైఎస్‌ఆర్ పెన్షన్ కానుక కింద అన్ని రకాల పెన్షన్లను ప్రనుత్వ నియమ నిబంధనలకు లోబడి అర్హులందరికీ వచ్చే నెలలో అందిస్తామని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. గురువారం మండల పరిధిలోని పోతేపల్లి గ్రామ సచివాలయంలో వైఎస్‌ఆర్ పెన్షన్ కానుకలో భాగంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో, పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన ప్రతి హామీ కూడా అమలు కావాలనేది సీఎం జగన్ ఆకాంక్ష అన్నారు. తదనుగుణంగా ఆర్థిక ఇబ్బందులను సైతం తన అధికారాన్ని సంక్షేమం కోసం వినియోగిస్తూ పేదలకు అండగా నిలుస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ సూర్యనారాయణ, డీఆర్‌డీఎ పీడీ శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ పిప్పళ్ల నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

గృహ నిర్మాణ పథకంపై
సచివాలయ సిబ్బందికి అవగాహనా సదస్సు
మండవల్లి, ఫిబ్రవరి 20: గృహ నిర్మాణ పథకం పనులపై గురువారం గ్రామ సచివాలయ సిబ్బందికి హౌసింగ్ డీఇఇ సిహెచ్ ఆదినారాయణ అవగాహనా సదస్సు నిర్వహించారు. గౄహనిర్మాణ లబ్ధిదారుల ఎంపిక, నిర్మాణ పనుల జీయో ట్యాగింగ్, బిల్లుల చెల్లింపు, నిర్మాణల్లో వివిధ స్టేజీలను గుర్తించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం పేదలకు నివేశన స్థలాలు పంపిణీ చేసిన అనంతరం గౄహ నిర్మాణ పనులు ఏలా చేపట్టాలి? ఏలా ధరఖాస్తు చేసుకోవాల్లో డీజీటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వేల్ఫేర్ అసిస్టెంట్‌లకు ముందుగా అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో లింగాల, కానుకొల్లు, పెరికేగూడెం, గన్నవరం గ్రామాలకు చెందిన సచివాలయ సిబ్బంది, గృహ నిర్మాణ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఇళ్లస్థలాల లేవుట్‌కు అధికారుల ప్రశంసలు
జి.కొండూరు, ఫిబ్రవరి 20: కందులపాడు శివారు చేగిరెడ్డిపాడులో పేదలకు ఉగాది నాటికి పంపిణీ చేయాలని సిద్ధం చేసిన ఇళ్ళస్థలాల లేవుట్‌కు అధికారుల ప్రశంసలు లభిస్తున్నాయి. జి ల్లాలోనే ఇక్కడ లేవుట్‌ను అత్యద్భుతంగా తీర్చిదిద్దారని మండల వైసిపి కన్వీనర్ మందా జక్రధరరావును జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. మైలవరం ఎ మ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు పనులను మందా జక్రధరరావు రేయింబవళ్లు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. సరిహద్దు రాళ్ళు పాతి, రహదారులను విడగొట్టి పేదలకు పంపిణీ చేయడానికి భూమిని చదును చేశారు. అక్కడకు చేరుకోవడానికి గ్రావెల్ రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే వసంత ని ధులను కేటాయించారు. గురువారం తహశీల్దార్ ఇంతియాజ్ పాషా, కందులపాడు వీఆర్వో నాగేశ్వరరావు, వీఆ ర్వో నాగులు, ఉపాధి హామీ పథకం అ ధికారులు పరిశీలించారు.