కృష్ణ

రాష్ట్రంలో ఆరాచక పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. బాపట్ల వైసీపీ ఎంపి నందిగం సురేష్ పెట్టిన కేసులో నందిగామ సబ్ జైలు నుండి టీడీపీ కార్యకర్తలు నేడు బెయిల్‌పై విడుదల అయ్యారు. ఈ సందర్భంగా వారికి సబ్ జైలు వద్ద కళా వెంకట్రావు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, బోడె ప్రసాద్, ఎమ్మెల్సీలు ఎఎస్ రామకృష్ణ, బచ్చుల అర్జునుడు, జెఎసి నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తూ రైతుపేటలోని అమరావతి దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కళా వెంకట్రావు మాట్లాడుతూ అమరావతి రాజధానిగా ఉండాలని గులాబీ పూలు ఇచ్చిన పాపానికి ఎంపి వారిపై ఎస్‌సి, ఎస్‌టి, అట్రాసిటీ కేసు పెట్టడం అన్యాయమన్నారు. శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తే కక్షకట్టి కేసులు పెడుతున్నారని, రాష్ట్రంలో ఆటవిక రాజ్యం విలయతాండవం చేస్తుందని విమర్శించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారనీ, ఎవరు ప్రశ్నిస్తే వారిపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఈ ప్రభుత్వం కాలగర్భంలో కలిసి పోతుందని, భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. కార్యక్రమాల్లో జిల్లా పార్టీ ప్ర ధాన కార్యదర్శి కోట వీరబాబు, జెఎసి నేతలు నీరుకొండ నర్శింహరావు, చలమల శ్రీనివాస్ చౌదరి, మండల పార్టీ అధ్యక్షుడు వీరంకి వీరస్వామి, కంచికచర్ల మండల పార్టీ అద్యక్షుడు కోగంటి బాబు, మాజీ సర్పంచ్ శాఖమూరు స్వర్ణలత, మాజీ ఎంపిపి మనె్న కళావతి, నాయకులు పులవర్తి నర్శింహరావు, అమ్మినేని జ్వాల, వడ్డెల్లి సాంబశివరావు, కొంగర మోహనమూర్తి, సజ్జా అజయ్, ఈవూరి వినోద్, మండవ శ్రీను, పులవర్తి కోటి, తోట నాగమల్లేశ్వరరావు, కొంగర నరేంద్ర, గోపు పూర్ణ తదితరులు పాల్గొన్నారు.