కృష్ణ

సచివాలయాలకే పరిమితం కాకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: సచివాలయ ఉద్యోగులు కేవలం సచివాలయాలకే పరిమితం కాకుండా నిత్యం ప్రజల మధ్య తిరుగుతూ వారి బాగోగులు పట్టించుకోవాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. గురువారం ఆయన నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆయా ప్రాంత సచివాలయాలను సందర్శించిన మంత్రి పేర్ని సచివాలయ ఉద్యోగులకు పలు సూచనలు సలహాలు చేశారు. చాలా మంది సచివాలయ ఉద్యోగులు ముఖ్యంగా మహిళా సంరక్షణ కార్యదర్శులు కార్యాలయాలకే పరిమితమవుతున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సచివాలయ ఉద్యోగులుగా మీపై ఎన్నో ఉన్నతమైన బాధ్యతలు అప్పగించారన్నారు. ఆ బాధ్యతలన్నింటినీ సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. తమకు కేటాయించిన సచివాలయ పరిధికే పరిమితం కావాలన్నారు. మీ సచివాలయ పరిధి దాటి మరో చోట విధులు నిర్వర్తించడానికి వీలు లేదన్నారు. 13, 14 వార్డుల్లో మున్సిపల్ పార్కులకు మంత్రి పేర్ని నాని భూమి పూజ చేశారు. అలాగేహిందూ కళాశాల వెనుక ఉన్న ఆంధ్రాబ్యాంక్ సమీపంలో ఉన్న పార్కుకు కూడా భూమి పూజ చేశారు. 9వ వార్డులోని ఎన్‌జీఓ కాలనీలో రూ.3.70లక్షలతో నిర్మించనున్న పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమాల్లో నగర పాలక సంస్థ కమిషనర్ శివరామకృష్ణ, ఆయా వార్డు వైసీపీ ఇన్‌ఛార్జ్‌లు కాగిత జవహర్ (బున్నీ), గాజుల భగవాన్, కొల్లు రమేష్, మాజీ జడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్, మున్సిపల్ ఇంజనీర్ త్రినాథబాబు, ఎఇ వరప్రసాద్, డీఇ వెంకటేశ్వరరావు, ఎలక్ట్రికల్ ఎఇ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.