కృష్ణ

ఏప్రిల్ 1 నుంచి బీఎస్-6 వాహన అమ్మకాలే జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: జిల్లాలో ని వాహన డీలర్లు ఏప్రిల్ 1నుండి బీఎ స్ 6 ప్రమాణాలు కలిగిన వాహనాలను మాత్రమే అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు జరపాలని డీటీసీ ఎస్ వెంకటేశ్వరరావు ఆ దేశాలు జారీ చేశారు. స్థానిక బందర్‌రోడ్డులోని డీటీసీ కార్యాలయం నుండి మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. డీటీసీ వెంకటేశ్వరరావు మా ట్లాడుతూ కేంద్ర రవాణా శాఖ నివేదిక సంఖ్య జీఎస్‌ఆర్/889/ఈ ప్రకారం 20 20, ఏప్రిల్ 1నుండి బీఎస్ 6 ప్రమాణా లు కలిగిన వాహనాలను మాత్రమే వా హన డీలర్లు అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు జ రపాలని బీఎస్ 6 కాకుండా ఏ ఇతర వాహనాలను అమ్మకాలు గాని రిజిస్ట్రేషన్‌గాని చేసే వీలుండదని తెలిపారు. వా హన డీలర్ల వద్ద బీఎస్ 6కి ముందు ప్ర మాణాలు కలిగిన వాహనాలు బీఎస్ 3,4,5 ఉన్నట్లయితే మార్చి 31వరకు ని రీక్షించకుండా మార్చి 15నాటికల్లా పూ ర్తిగా అమ్మకాలు, వాహన రిజిస్ట్రేషన్లు జరుపుకోవాలని కోరారు. సాంకేతికపరమైన ఇబ్బందులు వాటిల్లినా ఎటువం టి మినహాయింపులు ఉండవని తెలిపారు. రవాణా వాహనాలు లారీలు ట్యాంకర్లు మొదలైన వాటి విషయం లో బాడీబిల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుందని అటువంటి పనులు కూడా మార్చి 31లోపు పూర్తి చేసుకుని వాహన రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ నుండి పాత వాహనాలు రిజిస్ట్రేషన్లు జరగవన్నారు.
ఏప్రిల్ 1నుండి వాహనాల కొనుగోలు చేసే వినియోగదారులు కూడా ఈ నిబంధనల ప్రకారం బీఎస్ 6 ప్రమాణాలు కలిగిన వాహనాలు మాత్రమే కొనుగోలు చేసుకోవాలని డీటీసీ కోరారు.