కృష్ణ

వైభవంగా లక్ష్మీనారాయణుడి శాంతి కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండవల్లి: మండల కేంద్రం మండవల్లిలో వేంచేసియున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీకనకదుర్గ దేవి ఆలయంలో అత్యంత వైభవంగా పద్మావతి సమేత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామివారి శాంతి కల్యాణం జరిగింది. అమ్మవారి ఆలయ 4వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ పూజరి కొండురి సాయిబాబు ఆధ్వర్యంలో అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, లలితా పారాయణం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గుడివాడ వెంకటస్వామి దంపతులచే శ్రీపద్మావతి, శ్రీలక్ష్మీ అమ్మవార్లతో శ్రీ వెంకటేశ్వర స్వామివార్లకు శాంతి కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. కొనకళ్ల వరదారాజు, భక్తుల సహయంతో గ్రామ శ్రేయస్సు కొరకు స్వామివారికి శాంతి కల్యాణం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. వందలాది మంది భక్తులు స్వామివారి శాంతి కల్యాణాన్ని వీక్షించారు.

వీరులకొలుపు ఊరేగింపులు

జగ్గయ్యపేట, ఫిబ్రవరి 22: వీరుల కొలుపులను అట్టహాసంగా నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా తమ పెద్దలతో కూడిన వస్తువులను ముత్యాల కృష్ణానదిలో స్నానాలు ఆచరింపచేసి శనివారం పట్టణ వీధుల గుండా అట్టహాసంగా ఊరేగింపుగా తమ నివాసాలకు తీసుకువెళ్ళారు. ఈసందర్భంగా డీజేసౌండ్‌లు, డప్పు వాయిద్యాలు, యువకుల నృత్యాలు, వివిధ దేవతల వేషధారణలతో వేషధారులు అలరించారు.

రామేశ్వరస్వామి శివరాత్రి ఆదాయం రూ.5.93లక్షలు
తోట్లవల్లూరు, ఫిబ్రవరి 22: దక్షిణ కాశిగా పేరు గాంచిన ఐలూరు రామేశ్వర ఆలయంలో శివరాత్రి ఆదాయం రూ.5,93,188లక్షలు వచ్చాయని దేవదాయశాఖ అధికారి ఎస్‌వి సుబ్బారావు శనివారం తెలిపారు. హుండీ లేక్కించగా రూ.2,45,463లక్షలు, లడ్డూలు అమ్మగా రూ.1,63,65లులక్షలు, పులిహార అమ్మగా రూ.81,450లు, దర్శనము టిక్కెట్లు అమ్మగా రూ.1,02,670లు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజర్ జయశ్రీ, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఘనంగా శివపార్వతుల కల్యాణం

పెనుగంచిప్రోలు, ఫిబ్రవరి 22: శివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని పలు శైవ క్షేత్రాల్లో శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని గంగా పార్వతీ సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయం, అలాగే పడమట బజారులో వేంచేసి ఉన్న అంబికేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ఫ్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఉంచి అర్చకులు రోజులు సతీష్ శర్మ, పురోహితులు శివంభొట్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో వేద మంత్రాలతో స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. శివాలయంలో జరిగిన కల్యాణ మహోత్సవంలో గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త కర్ల శ్రీనివాసరావు, కాకాని సతీష్ దంపతులు, అంబికేశ్వరస్వామి ఆలయం వద్ద సుకాసి వెంకట రమణ దంపతులు పీటలపై కూర్చుని స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. కల్యాణ మహోత్సవం అనంతరం శివాలయంలో విజయవాడకు చెందిన కళాకారులు కుమారి గరిమెళ్ల సాయి స్నిగ్ధ, సిహెచ్ మోహిన్నూత చేసిన భరతనాట్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం కళాకారులను అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు వాసిరెడ్డి బెనర్జీ, ఉపాధ్యక్షుడు చింతల సీతారామయ్య, మండల వైసీపీ కన్వీనర్ వూట్ల నాగేశ్వరరావులు సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వేగినేటి గోపాలకృష్ణమూర్తి, కాకాని శ్రీనివాసరావు, గజ్జి కృష్ణమూర్తి, చుంచు రమేష్ బాబు, నూతలపాటి చెన్నకేశవరావు తదితరులు పాల్గొన్నారు.

కమనీయం.... స్వామివారి కల్యాణం

ముసునూరు, ఫిబ్రవరి 22: మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం రాత్రి శ్రీరామలింగేశ్వరస్వామివారి కల్యాణ మహోత్సవాలను వేదపండితుల మంత్రోచ్చరణలు, వేలాది మంది భక్తుల శివనామస్మరణల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితులు పొన్నూరు మల్లిఖార్జునరావు, తోలేటి అరుణభాస్కరాచార్యుల యాజ్ఞికంలో స్వామివారి కల్యాణాన్ని అత్యంత వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు. మచిలీపట్నం డీఎస్‌పి వెంకటేశ్వరరావు దంపతులతో పాటు మరో ముగ్గురు దంపతులు పీటలపై కూర్చుని స్వామివారికి కన్యాదానం చేశారు. ఈకల్యాణ వేడుకలను దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ సురేష్‌బాబు ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహాణాధికారి ఎస్ అమ్మేశ్వరరావు, పూర్వపు ఇఓ నాగసురేష్‌ల పర్యవేక్షణలో నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ కమిటి చైర్మన్ మానం ఘంటేశ్వరరావు, కమిటి సభ్యులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.