కృష్ణ

సీఏఏ, ఎన్‌ఆర్‌సీపై దుష్ప్రచారం మానుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు ఢిల్లీలో మద్దతు ఇచ్చిన ప్రాంతీయ రాజకీయ పార్టీలు రాష్ట్రంలో కేంద్రాన్ని తప్పుబట్టడం వారి రాజకీయ దుర్భుద్ధిని తెలియజేస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పంతం వెంకట గజేంద్రరావు విమర్శించారు. శనివారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎఎ, ఎన్‌ఆర్‌సీపై ప్రాంతీయ పార్టీలు వారి రాజకీయ మనుగడ కోసం లేనిపోని విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇటువంటి చర్యలకు పాల్పడటం గర్హనీయమన్నారు. ఏ ఒక్క ముస్లిం మైనార్టీలకు ఈ బిల్లు వల్ల నష్టం జరగదన్నారు. ఇప్పటికైనా మతపరమైన ఆరోపణలు మానుకుని పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని రాజకీయ పక్షాలను ఆయన విజ్ఞప్తి చేశారు. బీజేపీ జిల్లా కార్యదర్శి నూకల శేషయ్య నాయుడు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొడ్డు సునీల్, బీజేపీ మీడియా సెల్ జిల్లా కన్వీనర్ ఘంటా సతీష్ తదితరులు పాల్గొన్నారు.
భారత్ సాల్ట్స్‌పై ఎగుమతులపై చర్చకు సిద్ధమా..?
* అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ విఠల్ సవాల్

మచిలీపట్నం, ఫిబ్రవరి 22: భారత్ సాల్ట్స్ ద్వారా తానేదో అత్యధికంగా ఉప్పును ఎగుమతి చేస్తున్నట్టు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్, వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు బొర్రా విఠల్ పేర్కొన్నారు. శనివారం స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో విఠల్ మాట్లాడుతూ తనకు ఒకే ఒక్క లారీ ఉందని, ఆ లారీ ద్వారా భారత్ సాల్ట్స్ నుండి ఎగుమతి దిగుమతులు చేస్తున్నట్టు తెలిపారు. ఒకొక్క లారీలో 26 టన్నులకు మించి ఉప్పు లోడ్ చేయడం సాధ్యం కాదన్నారు. రవీంద్ర ఆరోపించిన విధంగా తాను ఏ ఒక్క రోజైనా తన లారీ ద్వారా అత్యధికంగా లోడ్ చేసినట్టు నిరూపించగలరా అని ప్రశ్నించారు. గడిచిన టీడీపీ ప్రభుత్వ ఐదేళ్లల్లో ఏ లారీ నుండి ఏ మేర ఎగుమతి జరిగిందో చర్చకు రవీంద్ర సిద్ధమా అని ప్రశ్నించారు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఎక్సైజ్ అధికారుల బదిలీలకు క్యాడర్‌ను బట్టి రేటు నిర్ణయించిన రవీంద్ర తనపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు మాదివాడ రాము, మీర్ అస్ఘర్, భూపతి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.