కృష్ణ

కృష్ణా వర్సిటీ ‘సొంతింట’ వసతులు కరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఆధునాతన సౌకర్యాలతో కూడిన భవంతుల్లో విద్యా బోధన చేస్తున్నామన్న సంతోషం ఒక వైపైతే కనీస సౌకర్యాలు లేక పడుతున్న కష్టాలు మరొక వైపుగా మారాయని కృష్ణా విశ్వ విద్యాలయం విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులే కాకుండా అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందితో పాటు తమ పిల్లల కోసం విశ్వ విద్యాలయానికి వచ్చే తల్లిదండ్రుల నోట వచ్చే మాట కూడా ఇదే. సువిశాలమైన 102 ఎకరాల్లో సుమారు వంద కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బందరు మండలం రుధ్రవరం గ్రామంలో కృష్ణా విశ్వ విద్యాలయం నూతన భవంతులను ఆధునాతన సౌకర్యాలకు అనుకూలంగా నిర్మించిన సంగతి తెలిసిందే. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభోత్సవం చేసుకున్న ఈ నూతన భవంతుల్లో తరగతులు ప్రారంభించడానికి యేడాది కాలం పట్టింది. ఈ నెల ప్రారంభలోనే విశ్వ విద్యాలయం సొంత క్యాంపస్‌లోకి అడుగు పెట్టి తరగతులతో పాటు అన్ని కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కార్యకలాపాలైతే ప్రారంభమయ్యాయి గానీ కనీస వసతులు కల్పించడంలో విశ్వ విద్యాలయం పెద్ద విఫలమయ్యారు. ఫలితంగా విద్యార్థుల పాలిట వసతుల కల్పన శాపంగా మారిందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఏ చిన్న అవసరమొచ్చినా విద్యార్థులతో పాటు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సుమారు 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న నగరానికి పరుగులెత్తాల్సిన పరిస్థితులు కొత్త క్యాంపస్‌లో నెలకొన్నాయి. ప్రధానంగా క్యాంటీన్ లేకపోవటంతో ఇతర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ విశ్వ విద్యాలయంలోనైనా క్యాంటీన్ అవసరం తప్పనిసరి. కానీ కృష్ణా వర్సిటీ కొత్త క్యాంపస్‌లో ఇప్పటి వరకు క్యాంటీన్‌ను ఏర్పాటు చేయలేదు. దీంతో మైలు రాళ్లు దాటుకుని కాలేఖాన్‌పేట లేదా జవ్వారుపేట సెంటరు వరకు రావల్సి వస్తోంది. విశ్వ విద్యాలయం పరిపాలనలో మరో కీలకమైనది పోస్ట్ఫాసు. ఒర్జినల్ డిగ్రీలు, కన్సలడ్‌టేడ్ మార్కుల మెమోలను విద్యార్థులకు నేరుగా ఇచ్చే పరిస్థితి విశ్వ విద్యాలయంలో లేదు. అలాగే రిజిస్ట్రార్ ఆఫీస్, సీడీసీ కవర్లు పంపడం తదితర అవసరాలు పోస్ట్ఫాసుతోనే ముడి పడి ఉన్నాయి. అలాగే బ్యాంకింగ్ సేవలు కూడా కీలకమైనవే. విశ్వ విద్యాలయంలో అన్ని రకాల పేమెంట్స్ ఆన్‌లైన్‌లోనే జరగాల్సి ఉంది. అది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్‌లోనే చెల్లించాలి. దీంతో కొత్త క్యాంపస్‌లో ఎహ్‌బీఐ బ్రాంచ్ అవసరం ఎంతైనా ఉంది. గతంలో అద్దె భవనంలో విశ్వ విద్యాలయం కొనసాగినప్పుడు ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ నగరంలోనే ఉండటంతో పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వలేదు. కానీ ఇప్పుడు కొత్త క్యాంపస్ నగరానికి పది కిలో మీటర్ల మేర ఉండటంతో బ్యాంకింగ్ సేవల విషయంలో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధాన సమస్య అయిన రవాణా సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కారం లభించలేదు. కొత్త క్యాంపస్‌లోకి వెళ్లిన మరుసటి రోజు నుండే ఉదయం, సాయంత్రం పూట కేవలం ఒకే ఒక్క ప్రత్యేక సర్వీసును ఆర్టీసీ నడుపుతోంది. కేవలం తరగతులు ప్రారంభం, ముగింపు సమయాల్లో ఆర్టీసీ సౌకర్యం ఉండటంతో ఇతర సమయాల్లో విశ్వ విద్యాలయానికి వచ్చే వారు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి తమ జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు. మరో సర్వీసును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఆర్టీసీ సర్వీసు ఏర్పాటు భారమైన పక్షంలో కొత్త క్యాంపస్‌లో ఉన్న రూట్‌లో పోలాటితిప్ప, కోన గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. సంబంధిత సర్వీసుల సమయాలను విశ్వ విద్యాలయం వద్ద అందరికీ తెలిసేలా ప్రదర్శిస్తే కొంతలో కొంత రవాణా సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే 102 ఎకరాల్లో ఉన్న కొత్త క్యాంపస్ నిర్మాణం జరిగింది. అయితే భవంతులు ఉన్న ప్రాంతం మినహా మిగిలిన ప్రాంతమంతా దట్టమైన చెట్లు, ముళ్ల పొదలతో నిండిపోయింది. చిట్టడివిని తలపించే విధంగా ఉన్న వీటిని తొలగించాలని విద్యార్థులు కోరుతున్నారు. లేకపోతే విష సర్పాలకు కొత్త క్యాంపస్ అవాస కేంద్రంగా మారే అవకాశమూ లేకపోలేదు. కొత్త క్యాంపస్ వాతావరణాన్ని ఏ మాత్రం ఆహ్లాదకరంగా లేకుండా పోయింది. గతంలో ఈ స్థలంలో చేపల చెరువు సాగు జరగటంతో అడ్డదిడ్డంగా ఉన్న గట్లను నేటికీ తొలగించలేదు. క్యాంపస్ ముందు నుండి వెళ్లే మురుగు నీటి డ్రైన్ నీరు కాస్త క్యాంపస్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో తిష్ఠ వేసి మురికి కూపంగా దర్శనమిస్తోంది. ఇప్పటికైనా విశ్వ విద్యాలయం అధికారులు వౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని విద్యార్థులు కోరుతున్నారు.