కృష్ణ

ఉగాది నాటికి అర్హులందరికీ ఇళ్ల స్థలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు): ఉగాది నాటికి అర్హులందరికీ ఇళ్ల స్థలాలు అందిస్తామని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. ఆదివారం మంత్రి కార్యాలయం వద్దకు వివిద సమస్యలపై పెద్ద సంఖ్యలో ప్రజలు విచ్చేసి తమ సమస్యలు తెలియజేసి పరిష్కరించాలని కోరారు. మండల పరిధిలోని కెపిటిపాలెంకు చెందిన గ్రామస్థులు మంత్రిని కలిసి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, తమ గ్రామం పరిధిలో మెట్ట పొలాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి నాని సంబంధిత విద్యుత్ శాఖ అధికాకారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని కోరారు. స్థానిక ఇంగ్లీష్‌పాలెంకు చెందిన వృద్ధురాలు నంగిగడ్డ జాన్‌బీ వేలిముద్రలు పడక రెండు మాసాలుగా రేషన్ బియ్యం అందడంలేదని మంత్రిని కోరగా సమస్యను పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో గత పది సంవత్సరాలుగా ఔట్ సోర్సింలో పని చేస్తున్న నాన్ టీచింగ్ స్ట్ఫాను పర్మినెంటు చేయాలని మంత్రిని కోరగా విశ్వవిద్యాలయం అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఇలా అనేక సమస్యలను మంత్రి నానికి విన్నవించుకున్నారు.

మెరైన్ డీఎస్పీకి అడిషినల్ ఎస్పీగా పదోన్నతి
కోడూరు, ఫిబ్రవరి 23: మెరైన్ డీఎస్పీగా పని చేస్తున్న సిహెచ్ ఆదినారాయణ అడిషినల్ ఎస్పీగా పదోన్నతి పొందినట్లు పాలకాయతిప్ప మెరైన్ పోలీసు స్టేషన్ సీఐ వల్లభనేని పవన్ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ నారాయణకు పదోన్నతి లభించటం పట్ల మెరైన్ ఎస్‌ఐలు జిలాని, సన్యాసి నాయుడు, రైటర్ రెహ్మాన్ జానీ, ఇతర సిబ్బంది అభినందనలు తెలిపారు.

వైభవంగా నాగేశ్వరస్వామి రథోత్సవం
కృత్తివెన్ను, ఫిబ్రవరి 23: మహా శివరాత్రి ఉత్సవాలలో భాగంగా మండల కేంద్రం కృత్తివెన్నులో వేంచేసియున్న శ్రీ దుర్గా పార్వతీ స్వామివారి రథోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి రథంపై అరటి పండ్లతో తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. స్వామివారిని బందరు శాసనసభ్యులు వల్లభనేని బాలశౌరి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథోత్సవంలో భక్తుల తాకిడి సందర్భంగా ఎలాంటి ఇబ్బంది కలుగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ చైర్మన్ కూనసాని నాగేశ్వరరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి శింగనపల్లి శ్రీనివాసరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఐ కొండయ్య సిబ్బందిచే బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ కొల్లాటి బాల గంగాధర్,కూనసాని గరుడ ప్రసాద్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.