కృష్ణ

అపరాలు, దాళ్వా వరిధాన్యం దిగుబడులపై రైతుల ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు): జిల్లా రైతులు అపరాలు, దాళ్వా దిగుబడులపై కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే జిల్లాలో మినుము కోతలు ఊపందుకున్నాయి. అలాగే దాళ్వా వరి నాట్లు పూరె్తై ఈనిక, సుంకు దశలో ఉన్నాయి. అయితే ఈ ఏడాది జిల్లాలో అపరాలు, దాళ్వాను రైతులు సాగు చేశారు. ఈ రెండు పంటల్లో ఏది లాభం చేకూరుస్తుందోనని రైతులు వెయ్యి కళ్లతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మినుము పైరు కోతలు కోస్తుండగా దళ్వా వరి దుబ్బు, ఈనిక, సుంకు దశలో ఉన్నాయి. అయితే ఈ ఏడాది ఈ రెండు పంటలకు తెగుళ్లు, పురుగుల ఉదృతి ఎక్కువగా ఉండటంతో రైతులు అయినకాడికి అప్పులు తెచ్చి మందులు పిచికారీ చేశారు. మినుము పంటను పల్లాకు తెగులు, ఆకు ఎండు తెగులు నాశనం చేసింది. దాళ్వాలో సాగు చేసిన వరి పరుకు ప్రస్తుతం కాండం తొలుచు పురుగులు తీవ్ర నష్టాన్ని కలుగ జేస్తున్నాయి. వీటన్నింటినీ తట్టుకుని ఎకరాకు 40 బస్తాల దిగుబడి వస్తుందని కొంత మంది రైతులు భావిస్తున్నారు. అయితే మినుములు మాత్రం కొన్ని ప్రాంతాలలో ఎకరాకు ఎనిమిది నుండి 10 బస్తాల వరకు దిగుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ముందుగా విత్తనాలు జల్లిన పైర్లు దిగుబడులు గణనీయంగా అవచ్చే అవకాశం ఉందని, ఆలస్యంగా విత్తిన మినుము పైరు దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని రైతులు పేర్కొంటున్నారు. అయితే ధాన్యం, మినుముల ధరలు మాత్రం రైతులకు అనుకూలంగా ఉండకపోవటంతో నష్టాల బారిన పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది రైతులు ఖరీఫ్ ధాన్యాన్ని కొనే నాదుడే లేడని ఆందోళన చెందుతున్న తరుణంలో మరలా దాళ్వా ధాన్యం రానున్నాయి. ఈ ధాన్యాన్ని ప్రభుత్వం ఏ ధరకు కొనుగోలు చేస్తుందోనని రైతులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాగే మినుము కోతలు కూడా పూర్తవటంతో ధరలు ఏ విధంగా ఉంటాయోనని ఆ రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉండగా రైతులు ఎలా ఉన్నా కూలీలకు మాత్రం చేతి నిండా పని దొరికింది. మినుము తీతలు, కుప్ప నూర్పిళ్లు, దాళ్వాలో కలుపు తీతలు వంటి పనుల్లో కూలీలు నిమగ్నమయ్యారు. దీంతో రెండు పూటలా అప్పులు చేయకుండా సంతోషంగా తింటున్నామని వారు పేర్కొంటున్నారు.

భయాందోళన కలిగిస్తున్న గొయ్యి
* పట్టించుకోని అధికారులు
చల్లపల్లి, ఫిబ్రవరి 23: ఆర్‌అండ్‌బీ శాఖాధికారుల నిర్లక్ష్యం, అలసత్వం వల్ల రహదారుల్లో గుంటలు పడినా పట్టించుకోకపోవటంతో ప్రయాణీకులు, పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఘంటసాల మండలం జీలగలగండి గ్రా మం మీదుగా ఘంటసాలకు వెళ్లే రహదారి అధ్వాన్నంగా తయారైంది. ము ఖ్యంగా ఎండకుదురు-మల్లాయి చిట్టూరుకు మధ్యన పెద్ద గొయ్యి పడటంతో ప్రయాణీకులు బెంబేలెత్తుతున్నారు. కొ ంత మంది ప్రయాణీకులు రాత్రిళ్లు ఆ గుంటలో పడి ప్రమాదాల బారిన కూడా పడుతున్నారు. పొలాల్లోని మీరుగునీరు పోయేందుకు రహదారికి తూములు ఏ ర్పాటు చేశారు. ఆ తుములు పగిలిపోవటంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ గొ య్యి కారణంగా అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారని అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోతుందని గ్రామస్థులు వాపోతున్నారు. ఇంత పెద్ద గొతిలో రేకులు, మట్టి వేసి కప్పటం వల్ల అది మరలా కోతకు గురైన గుంట పడుతుందని, తూములు ఏర్పాటు చేయమని అధికారులను కోరినా పట్టించుకోవటం లేదని కోసూరు రవిచంద్రుడు(రవి) అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తూమును ఏర్పాటు చేయకుండా మట్టిపోస్తే సహించేది లేదని, కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని అధికారులకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. నరక కూపంగా ఉన్న ఈ గోతిని పూడ్చి ప్రయాణీకులను రక్షించాలని కోరుతున్నారు.