కృష్ణ

ఘనంగా శ్రీరామకృష్ణ పరమహంస జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం(కల్చరల్): శ్రీరామకృష్ణ పరమహంస 185వ జయంతి ఉత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. స్థానిక భాస్కరపురం శ్రీ రామకృష్ణ ఆశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో భగవాన్ రామకృష్ణ పరమహంస, దివ్య జనని శ్రీ శారదామాతకు పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వేద విద్యార్థులకు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా శింగరాజు కల్యాణి, విశ్వనాద శాంత కుమారి, కాళిపట్నం ఉమ నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమం రంజింప జేసింది. అనంతరం నిర్వహించిన సభలో భారతీయ విద్యా భవన్ నగర శాఖ కార్యదర్శి బి సారంగపాణి రామకృష్ణ పరమహంస జీవిత విశేషాలు, సాధన మార్గాలు, సర్వధర్మ సమన్వయానికి పరమహంస చేసిన బోధనను వివరించారు. బిహెచ్‌విఎల్ రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రామకృష్ణ సమితి అధ్యక్ష, కార్యదర్శులు శింగరాజు గోవర్దన్, పివి దుర్గారావు, రామకృష్ణ ఆశ్రమం అధ్యక్ష, కార్యదర్శులు ఘంటా పద్మావతి, బివివి చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.

జాతీయ కరాటే పోటీల్లో మొవ్వ విద్యార్థుల ప్రతిభ
కూచిపూడి, ఫిబ్రవరి 25: మొవ్వ మండలానికి చెందిన నలుగురు చిన్నారులు జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారని కోచ్ వివిఎస్ రామకృష్ణ మంగళవారం తెలిపారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా పెరియార్ నగరంలో నిర్వహించిన ఐదవ జాతీయ కరాటే పోటీల్లో ఎపిఎల్‌ఎస్ వర్మ, చంద్రశేఖర్, టి సుభాష్, పి జీవనప్రకాష్, ఆర్ బానుశంకర్ మొదటి రెండు స్థానాలు సాధించారు. మంగళవారం మొవ్వలో విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులు కోచ్ రామకృష్ణను అభినందించారు.