కృష్ణ

నూజివీడు డివిజన్‌లో జనతా కర్ఫ్యూ సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు: కరోనావైరస్ వ్యాప్తి నివారణకై దేశ ప్రధాని నరేంద్రమోడి ఇచ్చిన పిలుపుమేరకు నూజివీడు డివిజన్‌లో ఆదివారం నిర్వహించిన జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. ప్రతి ఒక్కరూ బయటకు రాకుండా ఇళ్ళకే పరిమితం అయ్యారు. డివిజన్ పరిధిలోని ఆయా మండలాలతో పాటు పట్టణంలో ఆదివారం ఉదయం 7 గంటల నుండి ప్రజలు ఎవరూ బయటకు రాలేదు. పట్టణంలోని వర్తక, వాణిజ్య దుకాణాలను ఎవ్వరికి వారే స్వచ్చంధంగా మూసివేశారు. పెట్రోల్ బంక్‌లు, సినిమా ధియేటర్లు పనిచేయలేదు. ప్రజా రవాణ వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. నిత్యం ప్రజలతో కళకళలాడే ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారిపోయాయి. ప్రయాణికులు లేక ఆర్టీసి బస్‌స్టాండ్ బోసిపోయింది. జన సంచారం లేక పట్టణంలోని పలు ప్రధాన రహదారులన్ని వెలవెలబోయాయి. డిఎస్‌పి బి శ్రీనివాసులు పర్యవేక్షణలో సిఐ రామచంద్రరావు ఆధ్వర్యంలో పోలీసులు పట్టణంలో కర్ఫ్యూను పర్యవేక్షించారు. పోలీసులు మైక్ ద్వారా కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ప్రజలను చైతన్యపర్చారు. ప్రజలను బయటకు రావద్దంటూ సూచనలు జారీ చేశారు. సాయంత్రం సమయంలో డిఎస్‌పి బి శ్రీనివాసుల ఆదేశానుసారం పోలీస్ వాహనం ద్వారా సోమవారం ఉదయం 6 గంటల వరకు జనతా కర్ఫ్యూను పాటిద్దామని, ప్రజలు ఈవిషయాన్ని గమనించి సహకరించాలని మైక్ ద్వారా పోలీసులు ప్రచారం చేశారు. జనతా కర్ఫ్యూను పాటించి సహకరించినందుకు గాను డివిజన్‌లోని ప్రతి ఒక్కరికి డీఎస్‌పి శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు కర్ఫ్యూతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించి కరోనా వైరస్‌ను తరమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ నియంత్రణకు కృషి చేస్తున్న వైద్యులకు, పారిశుద్ద్య కార్మికులు ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు మాజీ శాసనసభ్యులు, బీజేపీ రాష్ట్ర నాయకులు చిన్నం రామకోటయ్య చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు.
ఎ కొండూరు మండలంలో...
ఎ కొండూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేరకు కరోనా వైరస్ నివారణకు ఎ కొండూరు మండలంలో ఆదివారం జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. ఆదివారం ఉదయం నుండి వర్తక, వాణిజ్య కేంద్రాలను స్వచ్చంధంగా మూసివేశారు. ప్రధాన రహదారులు జనసంచారం లేకుండా నిర్మానుషంగా మారాయి. అన్ని బస్సు సర్వీసులు రద్దయ్యాయి. ప్రజలందరూ ఇళ్ళకే పరిమితం అయ్యారని ఎస్‌ఐ కె ప్రతాప్‌రెడ్డి తన సిబ్బందితో గ్రామాల్లో ఎప్పటికప్పుడు పర్యటించి పర్యవేక్షణ జరిపారు.