బిజినెస్

కృష్ణా కలెక్టర్‌కు ఇ-గవర్నెన్స్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 3: కృష్ణా జిల్లాలో ఇ-పోస్ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు గాను జిల్లా కలెక్టర్ బాబు.ఎ గురువారం 2014-15 సంవత్సరానికి సంబంధించి ఇ-గవర్నెన్స్ ఎక్సలెన్సీ అవార్డును అందుకున్నారు. దేశంలో ఇ-గవర్నెన్స్ అమలు పరుస్తున్న 222 ప్రాజెక్టుల్లో కృష్ణా జిల్లాలో అమలవుతున్న ఇ-పోస్ ప్రాజెక్టు బెస్ట్ ప్రాజెక్ట్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇందుకు గాను గురువారం కొత్త ఢిల్లీలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో జిల్లా కలెక్టర్ బాబు.ఎ పాల్గొని ప్రతిష్ఠాత్మకమైన ఎక్సలెన్సీ అవార్డును సిఎస్‌ఐ చైర్మన్ ఇమ్మల్ రాయ్ చేతుల మీదుగా అందుకున్నారు. పౌర సరఫరాల పంపిణీ వ్యవస్థలో ఇ-పోస్ విధానాన్ని ప్రవేశపెట్టిన కలెక్టర్ బాబు.ఎ ప్రజలకు సకాలంలో నిత్యావసర వస్తువులు అందించటంతో పాటు కోట్లాది రూపాయల ధనాన్ని ప్రభుత్వానికి ఆదా చేశారు. అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా ఇ-పోస్ విధానాన్ని ప్రవేశపెట్టిన కలెక్టర్ బాబు.ఎ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు సైతం అందుకున్నారు. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలకు సైతం ఈ విధానం ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. లబ్ధిదారులకు ఇంటివద్దనే మైక్రో ఎటిఎంల ద్వారా 99.3 శాతం పెన్షన్లు పంపిణీ చేసి రాష్ట్రంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపారు. ఇటీవల కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాధికారులు జిల్లాలో పర్యటించి ఇ-పోస్ విధానాన్ని పరిశీలించి అభినందించారు. తమ రాష్ట్రాల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. (చిత్రం) సిఎస్‌ఐ చైర్మన్ ఇమ్మల్ రాయ్ చేతుల మీదుగా ఎక్సలెన్సీ అవార్డు అందుకుంటున్న కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు.ఎ