రాష్ట్రీయం

కృష్ణా.. ఎడారి!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తంగిడిగిలో నదీగర్భంలోనే రాళ్లుతేలిన వైనం
నీటి కోసం రైతుల భగీరథ యత్నం
గర్భం నుంచి కాల్వలు తవ్వుతున్న అన్నదాతలు
30కి పైగా మినీ ఎత్తిపోతల పథకాలు బంద్
తుప్పుపడుతున్న పంప్‌హాజ్‌లు, విద్యుత్ పరికరాలు

మహబూబ్‌నగర్, మార్చి 12: జీవనది కృష్ణమ్మ ప్రస్తుతం జీవంకోల్పోయి దర్శనమిస్తుంది. కర్ణాటక బంధాలను తెంచుకుని తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా తంగిడిగి దగ్గర అడుగుపెట్టే కృష్ణానది ప్రధాన ముఖద్వారం దగ్గరే నీరులేక ఎడారిగా మారింది. ఒకపక్క వర్షాభావం, మరోపక్క కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టులే కృష్ణా వట్టిపోవడానికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తంగిడిగి దగ్గర కృష్ణాను ఎటు చూసినా ఎడారిలా కనిపిస్తోంది. దీంతో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఎంత కరవు వచ్చిన కృష్ణానదిలో కొద్దో గొప్పో నీటి ప్రవాహం ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితి దారుణంగా మారడంతో రైతుల కష్టాలు మరింత పెరిగాయి. నదితీర ప్రాంత రైతులు సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. నదిలో కాల్వలు తవ్వుతూ, పైపులు వేస్తూ నీటిని తోడుకునే పనిలో పడ్డారు. నీళ్లులేక మణికంఠ ఎత్తిపోతల పథకం మూలనపడటంతో ఆయకట్టు రైతులు పంటలను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తంగిడిగి దగ్గర నదీగర్భంలో కాల్వలు తవ్వి మిగులునీటిని పంటలకు తరలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణానదికి అనుసంధానంగా ఉపయోగిస్తున్న మినీ ఎత్తిపోతల పథకాలు మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు 30కి పైగా పనిచేయకుండా పోయాయ. ఓపక్క నదిలో నీటిమట్టం లేనికారణంగా, మరోపక్క రైతులే మినీ ఎత్తిపోతలకు సంబంధించిన కరెంట్ బిల్లులు, మరమ్మతులు చేసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రస్తుతం మినీ ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన మోటార్లు తుప్పు పట్టే పరిస్థితికి చేరుకున్నాయ. నదిలో నీటి ప్రవాహముంటే పంటలు పండితే మినీ ఎత్తిపోతలపై రైతులు దృష్టి ఉండేది. కానీ వేసిన పంటలే ఎండిపోతుంటే మినీ ఎత్తిపోతల భారం తమవల్ల కాదని రైతులు తేల్చి చెబుతున్నారు. జూరాల మక్తల్, గద్వాల, దేవరకద్ర, కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గాల్లో పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కురుమూర్తిరాయ ఎత్తిపోతల పథకం కింద సాగుచేసిన పంటలు ఇప్పటికే ఎండిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. కృష్ణానదిలో నీరులేకపోవడంతో మినీ ఎత్తిపోతల పథకాలపై దృష్టి సారించని కారణంగా కోట్ల రూపాయాలు ఖరీదు చేసే పంప్‌సెట్లు, పైప్‌లైన్లు, విద్యుత్ పరికరాలు పూర్తిగా తుప్పుపట్టిపోతున్నాయి. కృష్ణానదిలో నీరులేక ఎటు చూసినా ఎడారిగా మారి పెద్దపెద్ద రాళ్లు, ఇసుక దిబ్బలు కనబడుతుంటే కృష్ణమ్మ పరవళ్లను గుర్తుచేసుకుంటూ ఎలాంటి పరిస్థితి వచ్చిందంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (చిత్రం) మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ సమీపంలో నీళ్లులేక రాళ్లు తేలిన కృష్ణా నదీ గర్భం