కరీంనగర్

నగర సమగ్రాభివృద్ధికి రూ.500 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 3: కరీంనగర్ నగర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం రూ.500 కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శనివారం నగరంలోని 25వ డివిజన్‌లో రూ.19లక్షలతో నిర్మించతలపెట్టిన సిసి రోడ్లు, డ్రైనేజీ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగర అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా రోడ్లు, డ్రైనేజీల వెడల్పు చేస్తున్నామన్నారు. కేంద్రం స్మార్ట్ సిటీ జాబితాలో కరీంనగర్‌ను చేర్చిందని, స్మార్ట్ సిటీగా ప్రకటింపజేసేందుకు ఎంపి, ఎమ్మెల్యే, మేయర్‌లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. స్మార్ట్ సిటి కావాలంటే ప్రజలకు వౌళిక వసతులు కల్పించాలని తెలిపారు. కమాన్ నుండి సదాశివపల్లి వరకు వెడల్పు రోడ్లు, మానేరుపై రూ.147కోట్లతో సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం నగర అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.100కోట్లు కేటాయించిందని తెలిపారు. కరీంనగర్ నగరాన్ని అంచలంచెలుగా సుందర నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ రవీందర్‌సింగ్, కార్పోరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.