కరీంనగర్

కనుచూపు మేరలో హరిత తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 26: రెం డున్నరేళ్ళుగా రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్న హరిత తెలంగాణ కనుచూపుమేరలోనే ఉందని, అనుకోకుండా కురిసిన వర్షాలతో జలాశయాలన్నీ నిం డుకుండలా మారి, పంటల సాగుకు అనుకూలంగా మారిందని ముఖ్యమం త్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. కొద్దిరోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ముంపుబారినపడ్డ ప్రాంతాలను సోమవారం ఆయన ఏరియల్‌సర్వే చేసిన అనంతరం కలెక్టరేట్‌లో ని ర్వహించిన విలేఖరుల సమావేశంలోమాట్లాడారు. ఇన్నాళ్ళుగా బోర్లు, బావులపై మాత్రమే ఆధారపడి సాగుచేస్తుండగా, ఇకముందు వర్షాధారపంటలకు కూడా బేఫికర్‌గా మారిందని, 9గంటలపాటు రైతులకు విద్యుత్ అందించేలా విద్యుదుత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. జి ల్లాలో చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమంద్వారా చెరువులు, కుంటల్లో పూ డిక తీయటం మూలంగానే భారీగా నీటినిల్వలు పెరిగాయన్నారు. తెలంగాణకే తలమాణికంగా చేపట్టిన మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులు సకాలంలో ము గియకపోవటంతో అనుకున్నమేర నీటి నిల్వ చేయలేకపోతున్నట్లు తెలిపారు. గుత్తేదారుల నిర్లక్ష్యం మూలంగానే కట్టకు గండిపడిందని, దీనిని తీవ్రంగా పరిగణించి కారకుడైన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టంచేశా రు. నిర్వాసితుల సమస్యలు ఫాస్ట్‌ట్రాక్ పద్దతిన పరిష్కరించనున్నట్లు, గతం లో తీసుకున్న నిర్ణయం మేరకు 2008 వరకే నిర్వాసిత కుటుంబాల్లోని మేజర్ల ను గుర్తించి, పరిహారం చెల్లించేలా ని బంధనలున్నా, వాటిని సవరిస్తూ తా జాగా నేటివరకు మేజర్లైన 5679 మందికి రూ. 114 కోట్ల మొత్తాన్ని చె ల్లించేందుకు అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. ఇదేవిధానా న్ని గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల పరిధిలోని నిర్వాసిత కుటుంబాలకు వర్తింపజేస్తున్నట్లు స్పష్టంచేశారు. వర్షాల మూలంగా జిల్లాలో ఇప్పటివరకు రూ. 24 కోట్ల 58 లక్షల 65 వేలరూపాయల నష్టం జరిగిందని, 155 గ్రామాల్లో 1099 హెక్టార్ల పంటనష్టంతో రూ. 1 కోటి 22లక్షల 64వేలు,1153 ఇళ్ళు పాక్షికంగా, 16 ఇళ్ళు పూర్తిగా ధ్వంసం కాగా రూ. 74లక్షల 33 వేల రూపాయ లు, 7 రోడ్లు, 5 చెరువులు కొట్టుకుపో గా, రూ. 21 కోట్ల 35 లక్షల75 వేల నష్టం జరిగినట్లు, పిడుగుపాటు, వరదల్లో నలుగురు వ్యక్తులు, 14 పశువులు మరణించినట్లు వె ల్లడించారు. అల్పపీడన ప్రభావం మరికొద్దిరోజులపాటు ఉన్నదృష్ట్యా జిల్లా య ంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండి, తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ఆ దేశించారు. ఈసమావేశంలోప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ, మంత్రులు ఈటెల రాజేందర్, తన్నీరు హరీష్‌రావు, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, సాంస్కృతిక సారధి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమ యి బాలకిషన్, పుట్టమధుకర్, గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్, కలెక్టర్ నీతూప్రసాద్, జెసి శ్రీదేవసేన, బల్దియా కమీషనర్ కృష్ణ్భాస్కర్‌తోపాటు నీటిపారుదలశాఖ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.