కరీంనగర్

కరీంనగర్‌లో కార్డన్ సెర్చ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 3: కరీంనగర్ నగర శివారు ప్రాంతాలైన హనుమాన్ నగర్, ఆర్‌బివిఆర్‌ఆర్ కాలేజీ, అపోలో రీచ్ ఆసుపత్రి వెనుకభాగంలో గురువారం వేకువజాము నుంచి ఉదయం వరకు పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన దృవపత్రాలు లేని 50 బైకులు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దృవపత్రాలను చూపించిన వారి వాహనాలను వదిలిపెట్టారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ నేరాల నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు అన్ని వర్గాల ప్రజలు తమవంతు సహకారం అందించాలని కోరారు. సంఘ విద్రోహ శక్తుల కదలికల నియంత్రణ అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు కార్డన్ సెర్చ్, ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఏకకాలంలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేయడం వల్ల సంఘవిద్రోహ శక్తులు పట్టుబడే అవకాశాలతో పాటు అక్రమ కార్యకలాపాలను నియంత్రించవచ్చని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు ఉన్నా, ఇతర ప్రాంతాలకు చెందిన వారు తలదాచుకుంటున్నట్లు అనుమానాలు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకునే అవకాశం లేక పోతే ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు ఏకమై అనుమానాస్పద వ్యక్తులను నిర్బంధించి పోలీసులకు అప్పగించాలని సూచించారు. సంఘ విద్రోహ శక్తుల కదలికల నియంత్రణ, అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే చర్యల్లో ప్రజలు తమవంతు బాధ్యతను నిర్వర్తించేందుకు చైతన్యంతో ముందుకు రావాలని కమీషనర్ పిలుపునిచ్చారు. ఈ తనిఖీల్లో ఎసిపి రామారావు, ఇన్‌స్పెక్టర్లు విజయసారథి, హరిప్రసాద్, సదానందం, కృష్ణాగౌడ్, లక్ష్మణ్ బాబు, ప్రకాష్, శశిధర్‌రెడ్డి, రమేష్‌లతోపాటు పలువురు పోలీస్ అధికారులు, 200 మంది పోలీసులు పాల్గొన్నారు.
బంద్ సందర్భంగా విస్తృత తనిఖీలు
మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గురువారం నగరంలోని పలుచోట్ల సోదాలు నిర్వహించారు. ప్రధానంగా రైల్వేస్టేషన్, ప్రభుత్వ ప్రధానాసుపత్రి, జిల్లాకోర్టు, తెలంగాణ చౌక్, మార్కెట్, ఆర్టీసి బస్టాండ్‌లలో పోలీసులు బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలను నిర్వహించారు. అలాగే శివారు ప్రాంతాల్లో వాహనాల తనిఖీ చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ చర్యలు కొనసాగాయి.