కరీంనగర్

సంవత్సరం సర్వీసు ఉన్నవారికి వారసత్వం వర్తిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, నవంబర్ 4: సింగరేణిలో విఆర్ ఎస్ మెడికల్‌లో ఉద్యోగాల కల్పనలో ఒక సంవత్సర ం సర్వీసు ఉన్నవారికి వర్తించేందుకు హైదరాబాద్‌లో సింగరేణి యాజమాన్యంతో టిబిజికెఎస్ నాయకులు ఒప్పందం చేశారని నాయకులు వై.సారంగపాణి, ఆరెల్లి పోశం తెలిపారు. శుక్రవారం ప్రధాన చౌరస్తా వద్దగల టిబిజికెఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 48 సంవత్సరాల వయస్సునుంచి 59 సంవత్సరాలు వయస్సు వా రు అర్హులని, ఈ ఒక్కసారి మాత్రమే ఈ నిబంధన ఈ ఉద్యోగానికి కొడుకు, అల్లుడు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలని తెలిపారు. సింగరేణి యాజమాన్యం విధివిధానాల సర్క్యూలర్ క్లియర్‌గా తెలియజేస్తారని, వారసత్వ ఉద్యోగాలు జాతీయ సంఘాల పోగొట్టితే 18 సంవత్సరాల తరువాత టిబిజికెఎస్ తిరిగి సాధించిందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కు వారు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో నాయకులు గద్ద కుమారస్వామి, మ్యాజిక్ హరి, మెట్ట శంకర్, దాసరి మొగిలి, గర్రెపల్లి కనుకయ్య, బొమ్మ అంజయ్య, లక్ష్మయ్య, రమేష్ రెడ్డి తదితరులున్నారు.