కరీంనగర్

భద్రతపై భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 4: శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. భద్రతపై భరోసా కల్పిస్తేనే ఇతర ప్రాంతాల నుండి పెట్టుబడులు వచ్చి అభివృద్ధి జరుగుతుందని, తద్వారా ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఆదివారం సాయంత్రం స్థానిక పోలీస్ హెడ్‌క్వార్టర్సలోని పరేడ్ మైదానంలో కమీషనరేట్ పరిధిలో 40 బ్లూకోట్స్ వాహనాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉండేందుకు ప్రభుత్వం పోలీస్ శాఖ కు పెద్దపీట వేస్తుందని, ఇందులో భాగంగానే స్టేషనరీ ఖర్చుల నిధుల విడుదల, నూతన వాహనాల మంజూరు, నిర్మాణాలను చేపడుతూ పోలీసులకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత, గౌరవం లభిస్తున్నదని అన్నారు. కరీంనగర్‌లో 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతోందని, అన్ని రంగాల్లోనూ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందు కు జిల్లా అధికారులు పని చేయాలని సూచించారు. ఆదర్శవంతమైన సమాజం నిర్మాణంలో అన్ని వర్గాల ప్రజ లు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ ఇంచార్జి డిఐజి రవివర్మ మాట్లాడుతూ నేరాల నియంత్రణకు కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో కమీషనర్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. శాంతిభద్రతలను మరింత అదుపులో ఉంచడంలో భాగంగా నిరంతరం గస్తీ నిర్వహణకు బ్లూకోట్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ బ్లూకోట్స్ ఏర్పాటు ద్వారా నిరంతరం నేరస్థులపై నిఘా ఉంచడంతో పాటు శాంతిభద్రతలు అదుపులో ఉండేందుకు దోహదపడుతుందన్నారు. పోలీస్ కమీషనర్ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ బ్లూకోట్స్ బృందాలు ప్రజల ఫిర్యాదులపై సత్వరం స్పందించి చర్యలు తీసుకుంటాయన్నారు. సంఘటనా స్థలానికి పది నిమిషాల వ్యవధిలో చేరుకుంటాయని చెప్పారు. ఈ వాహనాలకు జిపిఆర్‌ఎస్ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఒక వీడియో కెమెరా, టార్చిలైట్ అందజేయడం జరిగిందని తెలిపారు. జిపిఆర్‌ఎస్ విధానాన్ని కమీషనరేట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేసి పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, బొడిగె శోభ, మేయర్ రవీందర్ సింగ్, డిప్యూటి మేయర్ గుగ్గిళ్లపు రమేష్, ఎంపిపి వాసాల రమేష్, ఎసిపిలు రామారావు, రవీందర్ రెడ్డి, ప్రభాకర్‌లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రబీకి రైతన్న సిద్ధం..!
ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 4: మట్టిని నమ్ముకున్న రైతన్న కష్టాల నడుమ ఖరీఫ్ గట్టెక్కాడు. నోటి కాడికి వచ్చిన పంటను భారీ వర్షాలు తన్నుకుపోయాయి. కన్నీళ్లను దిగమింగుకున్న అన్నదాత రబీకి సిద్ధమవుతున్నాడు. వరి ధాన్యం అమ్ముకున్న కర్షకులు రబీకి శ్రీకారం చుట్టారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకుంటున్నారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో పది వేల హెక్టార్ల సాగు భూమి ఉంది. పైగా రైతులు ప్రతి యేటా 4.4వేల హెక్టార్ల వరకు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. విత్తు నాటేందుకు రైతులు ఇప్పటి నుంచే సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. పెరిగిన ధరల కారణంగా గత ఏడాది కంటే ఈ సారి హెక్టారుకు పాతిక శాతం పెట్టుబడులు అదనం కానున్నాయని రైతులు పేర్కొంటున్నారు. గడిచిన ఖరీఫ్ సీజన్‌లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న అన్నదాతలు రబీపై ఆశలు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. అన్నదాతలకు అన్ని విధాల అధికారులు చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది.
* అంచనాలు..
రబీ సీజన్‌లో సాగుకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువుల గురించి వ్యవసాయాధికారులు అంచనాలు సిద్ధం చేశారు. అన్నీంటిని అందుబాటులో ఉంచామని చెబుతున్నారు. 4.4వేల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని అంటున్నారు. 4.2వేల హెక్టార్ల వరి, 200 హెక్టార్లలో మొక్కజొన్న, పెసర, శనిగ, ఉల్లిగడ్డ, గోధుమ, వాణిజ్య పంటలు సాగవుతాయని అధికారులు తెలిపారు. విత్తనాలను సబ్సిడీపై అందించడానికి ఎల్లారెడ్డిపేట, తిమ్మాపూర్ సహకార సంఘాల ద్వారా సిద్ధంగా ఉంచామని అన్నారు. రబీ సీజన్‌కు 1100 టన్నుల యూరియా, 400 టన్నుల పోటాష్, 5టన్నుల జింక్ సల్ఫెట్ ఎరువులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం 100 టన్నుల కాంప్లెక్స్, 200 టన్నుల యూరియా నిల్వ ఉందని పేర్కొన్నారు.
* ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు- వ్యవసాయాధికారి భూమిరెడ్డి
రబీ సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాం. రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురయితే నేరుగా తమ దృష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కరిస్తాం. విత్తనాలు, ఏరువులు దుకాణాల్లో కొనుగోలు చేసే రైతులు తప్పని సరి బిల్లులు పొందాలని సూచించారు.ఎరువులు, విత్తనాలు దుకాణదారులు నల్ల దందా సాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
కూతురు పెళ్లి చూడకుండానే..తండ్రి మృతి
కాల్వశ్రీరాంపూర్, డిసెంబర్ 4: ఓ వైపు కూతురు పెళ్లి, మరోవైపు తండ్రి అనుమానాస్పద మృతి వివాహ వేడుకలతో కళ కళలాడాల్సిన రెండు కుటుంబాల్లో ఈ సంఘటన విషాదాన్ని నిం పింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన పురుషోత్తం స్వరూప-శంకరయ్యల కూతురు వౌనిక వివాహం అదే గ్రామానికి చెందిన మిట్టపల్లి సునీల్‌తో ఆదివారం ఉదయం జరుగాల్సి ఉంది. ఉదయమే ఇంటిలో నుండి వెళ్లిన పెళ్లి కూతురు తండ్రి శంకరయ్య పెళ్లి సుముహూర్తం వరకు తిరిగి రాకపోవడంతో అతనికోసం కొడుకు అశోక్ వెతకడంతో వారి సొంత పొలం వద్ద అపస్మారక స్థితిలో కనిపించాడు. హుటాహుటిన మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కూతురు పెళ్లి చూడకుండానే తండ్రి మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. సంఘటనా స్థలాన్ని సిఐ తుల శ్రీనివాస రావు, ఎస్‌ఐ పర్శ రమేష్ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కూలీ.. కడుపు ఖాళీ

కరీంనగర్, డిసెంబర్ 4: కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లు రద్దుచేసి 25రోజులు గడుస్తున్నా మార్కెట్ మాత్రం ఇప్పటికీ కోలుకోవటం లేదు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నా అవి కొంతమేరకే పరిమితం అవుతుండగా, రెక్కాడితే కాని డొక్కాడని వారికి అందటంలేదు. అసలే అత్తెసరు కూలీతో దినమొక గండంగా బతుకులీడుస్తున్న కూలీలపై పెద్దనోట్ల రద్దు చర్య పెనుప్రభావానే్న చూపింది. రాష్ట్రానికి అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతున్న నిర్మాణరంగం అతలాకుతలమై, చెల్లింపులకు సరిపడా డబ్బుల్లేక నిర్మాణదారులు చేతులెత్తేయటంతో ఈరంగంలోనే అత్యధికశాతమున్న కార్మికుల పరిస్థితి కడుదయనీయంగా మారింది. ఇంట్లో సరుకులు నిండుకోగా, నెల తిరిగినా చేతిలో చిల్లిగవ్వ లేక తెల్సినచోట అప్పులు చేయటం లేదంటే ఇంటిల్లి పాది పస్తులుండటం షరామామూలే అన్నట్లుగా మారింది. పెద్దనోట్ల రద్దుతో వ్యాపారాలు సాగక, కొత్తనోట్లు అందక ఉమ్మడి జిల్లాలో నిర్మాణ రంగానికి సంబంధించిన స్టీల్, సిమెంట్, ఇటుక వ్యాపారులు గత కొద్దిరోజులుగా తమ దుకాణాలు మూసివేశారు. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో హోల్‌సేల్,చిన్నా,చితక దుకాణాలు కలిపి 5వేలకు పైగా ఉండగా, నిర్మాణదారుల చేతుల్లో డబ్బుల్లేక, బ్యాంకుల నుంచి డబ్బులు విడిపించుకునే పరిస్థితులు కానరాక చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో గిరాకుల్లేక దుకాణాలు సైతం మూతపడ్డాయి. ఈపరిస్థితుల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వ్యవసాయరంగం తర్వాత నిర్మాణరంగంలోఎక్కువగా పనిచేస్తున్న లక్ష మందికి పైగా దినసరి కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అడ్డాకూలీలతో పాటు మేస్ర్తిల వద్ద పనిచేసే వారికి ప్రతిరోజు సాయంత్రం చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. పెద్దనోట్ల నిషేధం మూలంగా మార్కెట్‌లోరూ.2వేల నోట్లు మాత్ర మే చలామణిలో ఉన్నాయి. అయితే, వీటికి చిల్లర దొరకక, కూలీలకు డబ్బులు చెల్లించక భవన నిర్మాణదారులు అనేక ఇక్కట్లనెదుర్కొంటున్నారు. రోజువారీ చెల్లింపులే కనీసం రూ.5నుంచిరూ.10వేల వరకు ఉంటుండగా, బ్యాంకులో రోజుకు రూ.2వేలు మాత్రమే ఇస్తుండటంతో నిర్మాణదారులు ఏమి చేయాలో పాలుపోక తమ ఇళ్ళ నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నారు. ఈనేపథ్యంలో కూలీలకు పనులు లభించక గత పక్షం రోజుల నుంచి నిత్యం అడ్డావద్దకొచ్చి, కూలీకి పిలిచేవారికోసం ఎదురుతెన్నులు చేసి సాయంత్రం కాగానే ఖాళీచేతులతో తిరుగుముఖం పడుతున్నారు. తామే కాకుండా తమకుటుంబ సభ్యులను కూడా కాలే కడుపులతో పస్తులుంచుతూ, తెల్లవారి కూలీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈపరిస్థితులు ఇలాగే కొనసాగితే మరికొద్దిరోజుల్లో అప్పుల బాధలతో రైతులు, నేతన్నలు చేసుకునే ఆత్మహత్యల సరసన కూలీల ఆకలి చావులు కూడా చేరటం తథ్యమని విశే్లషకులు పేర్కొంటున్నారు.

జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థులు
సుల్తానాబాద్, డిసెంబర్ 4: రాష్ట్ర స్థాయిలో ఇటీవల జరిగిన ఫ్లోర్ బాల్ అండర్-17 బాల, బాలికల విభాగం పోటీల్లో సుల్తానాబాద్ ఆల్పోర్స్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కె.నిఖితా రెడ్డి, ఎ.సాయి కుమార్‌లు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈ నెల 7,8,9 తేదీల్లో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం రాయిపూర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని ప్రధానోపాధ్యాయుడు డి.ఎస్.కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ నరేందర్ రెడ్డి, డి.ఎస్.కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులను ఆదివారం అభినందించారు.

ఘనంగా మల్లన్న ఊరేగింపు
కమాన్‌పూర్, డిసెంబర్ 4: మండలంలోని జూలపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి ఉత్సవ విగ్రహంతో ఆదివారం ఊరేగించారు. జూలపల్లి గ్రామానికి చెందిన ఎలబోయిన వంశీయుల ఇంటి నుంచి గ్రామ శివారులో గల మల్లికార్జున స్వామి ఆలయం వరకు స్వామి వారిని పల్లకిలో ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలోని పురవీధుల్లో డోలు వాయిద్యాల నడుమ ఉత్సవ మూర్తులను ఊరేగించారు. స్వామివారి పల్లకిని మహిళలు భారీ ఎత్తున మం గలహారతులతో స్వాగతం పలికారు. మల్లన్న దర్శనం కోసం గ్రామంలోని భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి దర్శనం చేసుకొని టెంకాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా తమ కుటుంబాల్లో సంతోషంగా ఉండేలా చూడాలని స్వామివారిని వేడుకున్నారు. కాగా ఈ ఉత్సవాలు ప్రతీ నిత్యం మల్లికార్జున స్వామి ఆలయంలో ఉగాది వరకు నిర్వహిస్తారు.

ఉచిత వైద్య శిబిరానికి స్పందన
పెద్దపల్లి, డిసెంబర్ 4: ఉచిత మోగా వైద్య శిబిరానికి వృద్దులు, విశ్రాంతి ఉద్యోగులు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగపర్చుకోవాలని ప్రభుత్వ చీప్‌విఫ్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ట్రినిటి పాఠశాల ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంబించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడారు. విశ్రాంతి ఉద్యోగులు, వృద్దులకు ఉచిత వైద్య సేవలందించడం అభినందనీయమన్నారు. జిల్లా కేంద్రంలో విశ్రాంతి ఉద్యోగులకు, వృద్దులకు కార్పోరేట్ వైద్యం అందించేందుకు ఉచిత మోగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వివిధ విభాగాల్లోని నిపుణులైన వైద్యులచే వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

గత పాలకుల నిర్లక్ష్యం వల్లే దళితుల వెనుకబాటు
మానకొండూర్, డిసెంబర్ 4: గత పాలకుల నిర్లక్ష్యం వల్లే దళితులు అన్ని రంగాల్లో వెనుకబడి పోయారని రాష్టస్రాంస్కృతిక సారథి ఛైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అరోపించారు. అదివారం మండల పరిధిలోని వేగురుపల్లి గ్రామంలోని దళిత కాలనిలోకి వేకువ జామునే రసమయి బాలకిషన్ చేరుకొని ఇంటింట తిరుగుతూ ప్రజల సమస్యలను నేరుగా ఆయన అడిగితెలుకొన్నారు. ప్రజల సమస్యలు ఉంటే చెప్పండి సమస్యల ఉంటే చెప్పుతే వాటిని తీర్చుందుకే మీ ఎమ్మెల్యే నేరుగా మీవద్దకు వచ్చినాడు, చెప్పండి అంటు ప్రభు త్వ పథకాలు అర్హులకు అందుతున్నాయ లేద అని అడిగితెలసుకోన్నారు. దళితుల అభివృద్ధియే దేయ్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గ్రామం లో తాగునీటి సమస్య, సిసిరోడ్డు నిర్మించాలని ప్రజలు వినవించారు. తాగునీటి సమస్యపరిష్క రం కోసం సిసి రొడ్డు నిర్మిణానికి కృషి చేస్తాన్నాని హామి ఇచ్చారు. అనంతరం మండల పరిధిలోని పచ్చునూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం అవిష్కరణ పనులను పరిశించారు. అంబేద్కర్ విగ్రహం ఈనేల 11 ప్రారంభిస్తామాని తెలిపారు. గ్రామంలోని చిరువ్యారులతో మాట్లాడుతూ పెద్దనోట్ల సమస్యపై నేరుగా అడిగితెలుకోన్నారు. ఈకార్యక్రమంలో జడ్పిటిసి ఎడ్ల సుగుణాకర్, సర్పంచ్‌లు గోపు నర్సింహ రెడ్డి, ముద్దసాని శ్రీ్ధర్ రెడ్డి, ఎం ఎంసీ ఛైర్మన్ నగేష్, మాడ తిరుపతి, పాడల సతీష్, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు పాముల రమణ, ఎల్కపల్లి పౌల్ తదితరులు పాల్గోన్నారు.

పల్లెపల్లెకు రహదారుల నిర్మాణం
గోదావరిఖని, డిసెంబర్ 4: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాతనే మునుపెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి కెసి ఆర్ పల్లె పల్లెకు రహాదారుల నిర్మాణం ఏర్పాటు చేస్తున్నారని తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సొమారపు సత్యనారాయణ అన్నారు. ఆదివా రం పాలకుర్తి మండలంలోని బసంత్‌నగర్‌లో 15 లక్షల రూపాయల నిధులతో నిర్మాణం చేసే సిసి రోడ్డు పనులకు ఆర్టీసీ చైర్మన్ సొమారపు సత్యనారాయణ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో పాల్గొని మాట్లాడుతూ గతంలో ప్రభుత్వాలు ఎవ్వి కూడా తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి సరైన నిధులు మంజూరు చేయలేకపోయాయని, దాని కారణంగానే తెలంగాణ ప్రాంతంలోని అనేక గ్రామాల్లో రహాదారులు లేకుండా పోయాయని, ముఖ్యమంత్రి కెసి ఆర్ నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం ఇప్పటి వరకు వందల కోట్ల రూపాయలతో రోడ్లను నిర్మాణం చేసిందని, మన నియోజక వర్గానికే అనేక కోట్లతో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాని పేర్కొన్నారు. బంగారు తెలంగాణలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందని, ప్రపంచ దేశా లు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధినే చూస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపిపి ఆడేపు రాజేశం, జడ్పిటిసి సంధ్యారాణితోపాటు సర్పంచ్ పర్శవేని శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, టిఆర్‌ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ఉద్యోగాల పేరుతో మోసంచేస్తే చర్యలు
గోదావరిఖని, డిసెంబర్ 4: నిరుద్యోగ సమస్యను ఆసరాగా చేసుకొని సింగరేణి, ప్రభు త్వ, ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూళ్లు చేసే దళారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమీషనర్ విక్రమ్ జిత్ దుగ్గల్ ఆదివారం ఒక ప్రకటన ద్వారా హెచ్చరించారు. రామగుండం కమీషనరేట్ పరిధిలోని పారిశ్రామిక ప్రాంతంలో ఇలాంటి మోసాలు ఎక్కువగా ఇటీవల కాలంలో జరిగాయని, వాటిపై ఈ ప్రాంత ప్రజలు దళారులు చెప్పే మాటలు నమ్మవద్దని అన్నారు. వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూళ్లు చేసే వారిపై చీటింగ్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 2016 జనవరి నుంచి నవంబర్ వరకు 32 చీటింగ్ కేసులు నమోదు అయ్యాయని, ఉద్యోగాల కోసం ఎవ్వరికి డబ్బులు ఇవ్వొద్దని, అలా చేస్తే వారిపై అవినీతి నిరోధక చట్టం కింద శిక్షార్హులవుతారని అన్నారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రవీందర్‌ను సన్మానించిన ఎసిపి మల్లారెడ్డి
సుల్తానాబాద్, డిసెంబర్ 4: సుల్తానాబాద్ ప్రభు త్వ జూనియర్ కళాశాల ఆవరణలో రెండు రోజుల పాటు నాలుగు జిల్లాల స్థాయి వాలీబాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన స్థానిక స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు, ఈ వాలీబాల్ క్రీడల నిర్వాహకుడు ముస్త్యా ల రవీందర్‌ను ఆదివారం రాత్రి ముగిసిన క్రీడల్లో పెద్దపల్లి ఎసిపి నల్ల మల్లారెడ్డి, సిఐ శ్రీనివాస రావు, మాజీ ఎమ్మెల్యేలు బిరుదు రాజమల్లు, చింతకుంట విజయరమణా రావు, ఎస్‌ఐ జీవన్, సర్పంచ్ అంతటి అన్నయ్య గౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ సాయి రి మహేందర్‌తో పాటు పలువురు శాలువాలు కప్పి ఘనం గా సన్మానించారు. క్రీడాకారులకు భోజన వసతి, ఇతర ఏర్పాట్లు చేయడం, క్రీడల నిర్వహణకు ముస్త్యాల రవీందర్ చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు.