కరీంనగర్

నోట్ల రద్దు ఆర్థిక అరాచకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, జనవరి 3: కేంద్ర ప్రభు త్వం చేపట్టిన నోట్ల రద్దు చర్య ఆర్థిక ఆరాచకం పెరిగి దేశంలో అభివృద్ధి పూ ర్తిగా కుంటుపడిపోయిందని, ప్రగతి రథచక్రాలు రెండు మాసాలుగా నిలిచిపోయాయని, ఎఐసిసి పరిశీలకులు సి. జయప్రకాశ్ ఆరోపించారు. మంగళవా రం సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ నాయకు ల సమావేశం జరిగింది. స్థానిక పద్మశా లి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశానికి జయప్రకాశ్ ముఖ్యఅతిథిగా పాల్గొనగా కరీంనగర్ డిసిసి అధ్యక్షు డు కటుకం మృత్యుంజయం, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌లు పాల్గొన్నా రు. జనవరి 7న నోట్ల రద్దుపై కరీంనగర్‌లో భారీ ధర్నా, నిరసన కార్యక్రమా లు చేపట్టిన నేపధ్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎఐసిసి ప రిశీలకులు జయప్రకాశ్ మాట్లాడుతూ, భారతీయ జనతాపార్టీ ప్రవేశపెట్టిన రూ. 500లు, రూ.1000 నగదు రద్దు పథకం దేశంలోని పేదలు, రైతులు, కార్మికులు, చిల్లర వర్తక వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబీకులు, అసంఘటితరంగ ప్రజలపై ఒక భయంకరమె న, తీవ్రమైన శరాఘాతంగా మారిందన్నారు. ఒక శాతం నల్లధనం కలిగి ఉ న్న వ్యక్తులను కట్టడి చేయాలన్న కారణంతో 86 శాతం పెద్ద నోట్ల నగదు చలామణిని ఉపసంహరించడం ద్వా రా దేశంలోని 99 శాతం ప్రజలను హి ంసకు గురిచేయడం జరుగుతుందన్నా రు. పెద్ద నోట్ల రద్దు ప్రహసనం స్వ తంత్ర భారత చరిత్రలోనే ఒక కుంభకోణమన్నారు. బిజెపి కలకత్తా శాఖ ఖాతాలో రూ. 3 కోట్లు పాత నోట్లను జమచేస్తూ పట్టుబడిన వైనం ఉదహరిస్తూ ఈ కుంభకోణంలో అనేక ఉదాహరణలు వెల్లడించారు. పెద్ద నోట్ల నిర్ణయాన్ని ముందస్తుగా రహస్యంగా ఆర్‌ఎస్‌ఎస్ బిజెపి నాయకులకు తెలిపి నల్లధనాన్ని ఆస్తుల రూపంతో మార్చుకోడానికి నరేంద్ర మోడీ, అమిత్‌షాలు అవకాశం ఇచ్చారన్నారు. బ్యాంకులలో తమ అకౌంట్లలో డబ్బును తీసుకోవడానికి ఉన్న నిబంధనను ఉపసంహరించాలని, దీనిని ఉపహంహరించేవరకు తమ బ్యాంకు ఖాతాలలోగల అందరి నగదుకు 18 శాతం వడ్డీ చెల్లించాలని, నగదు రహిత లావాదేవీలన్నింటిపై అన్నిరకాల రు సుం రద్దుచేయాలని డిమాండ్ చేశారు. అలాగే భారత ఆహార భద్రత చట్టం ని బంధనలకు లోబడి జాతీయ పంపిణీ విధానం ద్వారా చేసే నిత్యావసర వస్తువులను ఒక సంవత్సరం వరకు సగం ధరకే పంపిణీ చేయాలన్నారు. ప్రస్తుత రబీ పంట కాలంలో రైతుల ఉత్పత్తుల పై వారికి లభించే మద్దతు ధరపై ఇరవై శాతం బోనస్ అధికంగా చెల్లించాలన్నారు. ఎలాంటి షరతులు లేకుండా దారిద్య్రరేఖకు దిగువనఉన్న కుటుంబంలోని కనీసం ఒక్కో మహిళ ఖాతాలో రూ. 25 వేలు జమ చేయాలన్నారు. ఉ పాధి హామీ కూలీలకు ఒక సంవత్స రంపాటు రెట్టింపు చేయాలన్నారు. చి రు దుకాణాదారులు, చిన్న వర్తకులకు ఆదాయ పన్ను, అమ్మకం పన్నులను 50 శాతం తగ్గించాలని దీనిలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఏర్పడే నష్టాలను కేంద్ర మే భరించాలని మొదలైన డిమాండ్లు చేశారు. కార్యక్రమంలో పట్టణ కాం గ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, సీనియర్ నాయకులు నాగుల సత్యనారాయణ, వివిధ మండలాల పార్టీ నా యకులు పాల్గొన్నారు.