కరీంనగర్

రహదారి భద్రత అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, జనవరి 17: వాహనా లు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాల ను పాటించకపోవడం మూలంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని, రహాదారి భద్రత మనందరి బాధ్యతని రామగుండం పోలీస్ కమిషనర్ విక్ర మ్‌జిత్ దుగ్గల్ తెలిపారు. 28వ జాతీ య రహాదారి భద్రతా వారోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని పోలీస్ కమీషనర్ విక్రమ్ జిత్ దు గ్గల్ కమీషనరేట్ కార్యాలయం నుంచి హెల్మెట్ ధరించి 300 మందితో చౌర స్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గోదావరిఖని ప్రధాన చౌర స్తా వద్ద వివిధ పాఠశాలలకు చెందిన వందలాదిమంది విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతా అంశాలపై అవగాహన కల్పించారు. పోలీస్ కమీషనర్ దుగ్గల్ మాట్లాడుతూ వాహనం నడిపే ప్రతీఒక్కరూ హెల్మెట్ ధరించాలని, అతివేగం ప్రమాదకరమని, మ ద్యం సేవించి వాహనాలు నడుపవద్దని, మీ భద్రతే కుటుంబానికి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. విద్యార్థులచే ట్రాఫిక్ నియమ, నిబంధనల గురించి వివరింపజేశారు. బాధ్యతగల ప్రతీఒక్కరూ ట్రాఫిక్ నియంత్రణ కోసం వాలంటరీ గా చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం హెల్మెట్ కౌంటర్లను ప్రారంభించారు. సమావేశంలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల డిసిపిలు విజేందర్‌రెడ్డి, జాన్‌వెస్లీ, రామగుండం కార్పొరేషన్ కమీషనర్ డి.జాన్‌శ్యాంసన్, సిఐలు చిలుకూరి వెంకటేశ్వర్లు, ఆరె వెంకటేశ్వ ర్, వాసుదేవరావు, ఎంవిఐ రంగారావు, ఎస్‌ఐలు మహేందర్, చంద్రశేఖర్, దే వయ్య, ప్రమోద్‌రెడ్డి, తదితరులు పా ల్గొన్నారు. అంతకుముందు ఎన్టీపీసీ ఇడిసి బిల్డింగ్‌లో యాక్సిడెంట్ రెజలూ యషన్ టీం (ఎఆర్‌టి) అధికారులతో రహదారి భద్రతపై సమావేశమయ్యారు. ఫోర్ లైన్ రహదారిపై ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.

షరతులు లేకుండా
వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలి
* ఆర్‌సిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి
* నేడు ‘బండారి’ అమరణదీక్ష
గోదావరిఖని, జనవరి 17: సింగరేణి లో షరతులు లేకుండా వారసత్వ ఉ ద్యోగాలు ఇవ్వాలని రాష్ట్రీయ కాలరీస్ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షురాలు సొమారపు విజయలక్ష్మి డిమాండ్ చేశారు. మంగళవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సంవత్స రంలోపు ఉన్న కార్మికులందరికి వారసత్వపు ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఒక్క రో జు సర్వీసు ఉన్న వారసత్వ ఉద్యోగాలు అమలు జరిగేలా చూస్తామని పేర్కొని ఇప్పుడు షరతులు విధించడం సరైం ది కాదన్నారు. వారసత్వపు ఉద్యోగాలపై సింగరేణి యాజమాన్యం అవలంబిస్తున్న మొండివైఖరి మూలంగా సిం గరేణి వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగ అవకాశాలు లేకుండా రోడ్డున పడే పరిస్థితి వస్తుందని అన్నారు. వారసత్వపు ఉద్యోగాల సాధన కోసం రాష్ట్రీయ కాలరీస్ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షుడు బండారి సత్యనారాయణ అమరణ దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. బుధవారం ఆర్జీ- 1 సిజిఎం కార్యాలయం ముందు సత్యనారాయణ దీక్ష చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్మికులంతా భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. దీక్షలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్న పూర్తి బాధ్యత యాజమాన్యానిదేనన్నారు. విలేకరుల సమావేశంలో సతీష్, కుమార్, సం తోష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.