కరీంనగర్

‘డివైసి’ సమస్యలకు ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జనవరి 30: ప్రతీ సోమవారం నిర్వహించే ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమానికి వచ్చే సమస్యలకు అధికారులు అధిక ప్రాధాన్యతనివ్వాలని జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా అధికారులతో కలిసి ‘డ యల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ గ్రామాల్లో వృద్ధులు, పేదవారు ప్రభుత్వ కార్యాలయాలకు ఆర్థిక కారణాల వల్ల వెళ్లలేనివారు దీనిలో తమ సమస్యలను ఫోన్ ద్వారా తెలుపుతారన్నారు. సంబంధిత అధికారులు వారి సమస్యలకు సానుకూలంగా స్పందించి పాజిటివ్‌గా వెంటనే పరిష్కరించాలని, పని జరుగలేదని మళ్లీ వారు ఫోన్ చేయకుండా చూడాలన్నారు. రామడుగు మండలం కొక్కెరకుంట నుండి తిరుపతి మాట్లాడుతూ హరితహారంలో పెట్టిన ఈత చెట్లు ఎండిపోతున్నాయని, ఎంపిడిఓ పట్టించుకోవడం లేదని తెలుపగా వెంటనే చర్యలు తీసుకుంటామని, ఎండిపోకుండ చూస్తామని అన్నారు. హుజూరాబాద్ నుండి రాజయ్య మాట్లాడుతూ జడ్పీ హైస్కూళ్లో డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారని తెలుపగా వెంటనే డిఇఓ మాట్లాడుతూ తనిఖీ చేస్తామని తెలిపారు. రామడుగు మండలం వెదిర గ్రామం నుండి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇంకుడు గుంతల డబ్బులు తొమ్మిది నెలల నుండి రాలేదని తెలుపగా వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. కరీంనగర్ సప్తగిరి కాలనీ నుండి అశోక్ కుమార్ మాట్లాడుతూ తమ కాలనీలో రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయిందని, సిమెం టు రోడ్ వేయలేదని, కంకర పోసి వదిలేశారని కోరగా మున్సిపల్ కమీషనర్‌కు చెప్పి వేయిస్తామని తెలిపారు. చొప్పదండి నుండి అంజయ్య మాట్లాడుతూ బాయిస్ హాస్టల్‌లో వాచ్‌మెన్‌కు బదులు ఆయన కుమారుడు విధులు నిర్వహిస్తున్నాడని, అతడు అరాచ్‌మెంటు చేస్తున్నాడని, అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరగా డిఇఓ తనిఖీ చేసి చర్యలు తీసుకుంటారన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి విజ్ఞప్తులను జెసి స్వీకరించారు. కార్యక్రమాల్లో డిఆర్‌ఓ ఆయేషా మస్రత్ ఖానమ్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.