కరీంనగర్

గుట్కా దందాపై కఠినంగా వ్యవహరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఫిబ్రవరి 3: ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే చర్యల్లో భాగంగా గుట్కా దందాను సాగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, అవసరమైతే పిడి యాక్టును ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోమని కరీంనగర్ పోలీసు కమిషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి హెచ్చరించారు. అరెస్ట్ చేసిన నిందితులు తమ పద్ధతులు మార్చుకోవాలని, లేనిపక్షంలో కఠినంగా వ్యవహరిస్తామని, ఇందులో ఎంతటి వారి ప్రమేయమున్నా సరే వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పరారీలో ఉన్న వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. గుట్కా, మట్కా, పేకాట తదితర వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. కొనుగోలు చేసి దగ్గర ఉంచుకున్న కిరాణా వ్యాపారులు, పాన్‌షాప్ నిర్వాహకులు స్వచ్ఛందంగా గుట్కా ప్యాకెట్లను ధ్వంసం చేయాలని, దాడుల్లో పట్టుబడితే నాన్ బేలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు సిపి అన్నపూర్ణ, ట్రైనీ ఐపిఎస్ అధికారి సంగ్రామ్ జి. పాటిల్, ఎసిపిలు రామారావు, తిరుపతి, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసరావు, సదానందం, కృష్ణగౌడ్, పలువురు పాల్గొన్నారు.
శివారు ప్రాంత ప్రజలు గుర్తింపు కార్డులు కలిగి ఉండాలి
ముకరంపుర (కరీంనగర్), ఫిబ్రవరి 3: శివారు, సమస్యాత్మక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పౌరులు గుర్తింపు కార్డులను కలిగి ఉండాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి అన్నారు. సంఘ విద్రోహ శక్తుల కదలికల నియంత్రణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్ మండలంలోని ఆసీఫ్‌నగర్, తమిళ కాలనీలలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతీ ఇంటిని సోదా చేశారు. అనంతరం కాలనీవాసులతో కమీషనర్ మాట్లాడుతూ ప్రజల్లో భద్రతపై భరోసా కల్పించేందుకు పోలీసులు అక్రమ కార్యకలాపాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. పోలీసులు చేపడుతున్న చర్యలను అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. ఆసిఫ్‌నగర్, తమిళ కాలనీ ప్రాంతాల్లో క్వారీల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన అ నేక మంది కార్మికులు ఉన్నారని, సం ఘ విద్రోహశక్తులు కార్మికుల ముసుగులో తలదాచుకునే ప్రమాదం ఉం దన్నారు. అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు అందుతున్న అనుమానిత ప్రాంతాలలో కార్డన్ అండ్ సెర్చ్‌లను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

ఊపందుకున్న ఈనామ్ కొనుగోళ్లు
* జమ్మికుంటలో పత్తి ధర 5,560 రూపాయలు
* భారీగా తరలి వచ్చిన పత్తి వాహనాలు
జమ్మికుంట, ఫిబ్రవరి 3: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు భారీగా పత్తి వాహనాలు అమ్మకానికి తీసుకరాగా శుక్రవారం పూర్తి స్థాయిలో కొనుగోళ్లు పాలకవర్గం, అధికారుల చొరవతో జరిగాయి. మార్కెట్‌లో రెండు, మూడు రోజులు మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొన్ని వాహనాలు నేరుగా మిల్లులకు వ్యాపారులు తరలించి కొనుగోళ్లు జరిపారు. మార్కెట్ చైర్మన్ రమేష్, అడ్తిదారులు, ఖరీదుదారులతో పలు దఫాలుగా చర్చలు జరిపి శుక్రవారం మిల్లువద్ద వాహనాలు ఉండకుండా పూర్తి స్థాయిలో మార్కెట్‌కు వచ్చేవిధంగా చర్యలు చేపట్టారు. నేరుగా కొనుగోళ్లు జరుపవద్దని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఈనామ్ కొనుగోళ్లు అమలు చేయాలని కోరగా అన్ని వర్గాలు సహకరించాయి. సాఫీగా ఈనామ్ అమలైంది. వ్యాపారులు సీక్రేటుగా ధరలు ఆన్‌లైన్‌లో రశీదులు పరిశీలించి నమోదు చేశారు. మార్కెట్‌కు 215 వాహనాల్లో 2,341 క్వింటాళ్లు, 525 క్వింటాళ్లు పత్తిని తీసుకవచ్చారు. పత్తికి గరిష్ట ధర 5,560, కనిష్ట ధర 5,500, మాడల్ ధర 4,500 రూపాయాలు పలికింది. కాగా, మార్కెట్ చైర్మన్ రమేష్ నగదు రహిత లావాదేవీలను కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్‌చైర్మన్ రాజేశ్వర్‌రావు, అడ్తిదారులు, వ్యాపారులు, రైతు లు,అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.