కరీంనగర్

వారసత్వ ఉద్యోగాలు ఆగిపోతే సర్కారుదే బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి, మార్చి 17: సింగరేణి వారసత్వ ఉద్యోగాలు ఆగిపోతే సర్కారే బాధ్యత వహించాలని మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీ్ధర్‌బాబు హెచ్చరించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్‌ఎస్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్కారు తప్పిదాలతో కార్మికు లు నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం వారసత్వ ఉద్యోగాలపై అధ్యయనం చేయకుం డా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ... ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభు త్వం... కోర్టు సాకు చూపేందుకు ప్రయత్నిస్తోందన్నారు. మళ్లీ సుప్రీం కోర్టుకు వెళతామనడం కార్మికులను మభ్యపెట్టడమేని స్పష్టంచేశారు. ప్రభు త్వం, సింగరేణి యాజమాన్యం ఆదరాబాదరగా తీసుకున్న నిర్ణయానికి ఎంతోమంది కార్మికులు నష్టపోతున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ అనాలోచిత నిర్ణయంతో సలహాలు, సూచనలు లేకుండా అధికారులు ఏదై నా నిర్ణయం తీసుకునే ముందు విధాన పరమైన ఆలోచనలు చేయకుండా కార్మికులను ఎంతకాలం మభ్యపెటుతావని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అంటే దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తారు. కేవలం పక్కదారి పట్టించేందుకే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే కార్యక్రమం తప్పా .. ఇంత వరకు ఏ ఒక్క స్కీం కూడా నెరవేర్చలేకపోయారని విమర్శించారు. ప్రభుత్వం హైకోర్టులో మీవాదనలు ఎందుకు వినిపించ లేకపోయారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టులో మీవాదనలు వి నిపించి ఎంతో ఆశలు పెట్టుకున్న వారసత్వ ఉద్యోగాలు అందెలా చూడాలని శ్రీ్ధర్‌బాబు డిమాండ్‌చేశారు. బొంప ల్లి దళితుల దంపతులపై దాడిపై కలెక్టర్ తీసుకున్న నిర్ణయం సరైందన్నా రు. రాబోయే రోజుల్లో మళ్లీ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో మాజీ జడ్పిటీసీ ఈర్ల కొమురయ్య, జెడ్పిటీసీ యాట దివ్యారెడ్డి, ఐఎన్‌టీయూసీ జన ప్రసా ద్, బడిగెల రాజేందర్, అంతటి అన్నయ్యగౌడ్, వేముల రామ్మూర్తి, మంథని నర్సింగ్, బండారి సునీల్‌గౌడ్, కడార్ల శ్రీనివాస్, రాజ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.