కరీంనగర్

మాఫీయాలపై సీపీఐ విచారణ చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 11: నరుూం గ్యాంగ్, డ్రగ్స్, ఇసుక, భూ మాఫీయాలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సోమవారం బద్ధం ఎల్లారెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరుూం గ్యాంగ్‌తో కొందరు అధికార పార్టీ నేతలు చేతులు కలిపినట్లు ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. నరుూం గ్యాంగ్ కేసులో దొరికిన వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించారు. డ్రగ్స్ మాఫీయాపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలుపాలని, ఇసుక, మియాపూర్ భూ మాఫీయాలపై సర్కార్ వ్యవహరిస్తున్న మెతక వైఖరిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. వందల కోట్లు ఖర్చు చేసి ప్రపంచ పారిశ్రామిక సభలు నిర్వహిస్తే, రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు దిశా నిర్ధేశం లేదని అన్నారు. ప్రాజెక్టులపై ప్రభుత్వ విధానం స్పష్టం చేయాలని, ఇందుకు వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని చాడ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి కె.రాంగోపాల్ రెడ్డి, నాయకులు కేదారి, కూన శోభారాణి, కాలువ నర్సయ్య యాదవ్, మణికంఠ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రాహుల్ నాయకత్వంలో అధికారంలోకి కాంగ్రెస్
* మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ రూరల్, డిసెంబర్ 11: రాహుల్ గాంధీ నాయకత్వంలో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వస్తామని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రాహుల్ గాంధీ ఎన్నికైన సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ యువతకు, మహిళలకు అన్ని రంగాల్లో సమప్రాధాన్యం ఇచ్చేందకు రాహుల్ గాంధీ నాయకత్వమే నిదర్శనమన్నారు. గతంలో దేశ అభివృద్దికి ప్రజా సమస్యల కోసం పార్టీ ఎంతో కృషి చేసిందని తెలిపారు. పటిష్టమైన ప్రణాళికలతో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అన్ని రంగాల వారికి చేయూతనిస్తుందన్నారు.