కరీంనగర్

నేర రహిత కమిషనరేటే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, డిసెంబర్ 12: నేర రహిత కమిషనరేట్‌గా రామగుండంను తీర్చిదిద్ధేందుకు పోలీస్ సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ విక్రమ్ జిత్ దుగ్గల్ పిలుపునిచ్చారు. రామగుండం ఎన్టీపీసీ టిటిఎస్‌లోని మిలినీయం హాల్‌లో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బందితో మంగళవారం నేర సమీక్ష సమావేశం జరింది. లా అండ్ ఆర్డర్ సమస్యలపైన, పెండింగ్ కేసుల వివరాలపై, అందుకు గల కారణాలు, ప్రజలతో పోలీసు అధికారుల ప్రవర్తన, కాళేశ్వరం ఎత్తి పోతలకు సంబంధించిన సమస్యలపైన, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఎఎస్‌ఐల ప్రమోషన్లపై, కమీషనరేట్ పరిధిలో పిడి యాక్టు ప్రపోజల్స్ వ్యక్తుల గురించి, ట్రాఫిక్ సమస్యలపై, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాల గురించి, రోడ్లు ప్రమాదాలు సంభవించే ప్రాంతాల గురించి తదితరల అంశాలపై ఈ సమీక్ష కొనసాగింది. ఈ సందర్భంగా సిపి విక్రమ్ జిత్ దుగ్గల్ రామగుండం కమిషనరేట్ పరిధిలో పాత నేరస్థులపై పోలీసులు ఓ కనె్నసి ఉండాలని, వారి కదలికలపై దృష్టి సారించాలని సూచించారు. పోలీసులు ప్రజలతో మంచి సత్సంబంధాలను ఏర్పరుచుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణకు ఆధునిక టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్నామని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. కాళేశ్వరం ఎత్తి పోతల పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఏర్పాట్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేసిన్నట్లు తెలిపారు. సమీక్షలో డిసిపిలు విజేందర్ రెడ్డి, వేణుగోపాల్ రావు, ఎఆర్ అడిషనల్ డిసిపి ప్రవీణ్ కుమార్, అడిషనల్ డిసిపి రవి కుమార్, రెండు జిల్లాలకు చెందిన ఎసిపిలు, సిఐలు, ఎస్‌ఐ, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సాహిత్యదర్శిని ఆవిష్కరణ
సిరిసిల్ల, డిసెంబర్ 12: ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని భాషా, సాంస్కృతిక శాఖ రూపొందించిన జిల్లా సాహిత్య దర్శినిని కలెక్టర్ డి.కృష్ణ్భాస్కర్ మంగళవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ప్రపంచ తెలుగు మహాసభలను సందర్భంగా జిల్లాలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక కార్యక్రమాలలో భాగంగా డీపీఆర్‌వో, జిల్లా భాషా సాంస్కృతిక శాఖ కన్వీనర్ మామిం డ్ల దశరథం నేతృత్వంలో ‘సాహిత్య దర్శిని’ పుస్తకంను రూపొందించారు. జిల్లాలో సాహితీ చిరిత్ర, ప్రముఖ వ్యక్తులు, జిల్లా ప్రముఖ వ్యక్తులు, జి ల్లా ప్రముఖ కవులు, వర్థమాన కవుల స్వపరిచయాలతో సాహిత్య దర్శినిని రూపకల్పన చేశారు. సాహిత్య దర్శినిని ఆవిష్కరించిన అంతరం జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్ మాట్లాడుతూ స్వల్ప సమయంలో సాహిత్య దర్శినిని ఆకర్శనగా రూపొందించడం అభినందనీయమన్నారు. జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు డా.జనపాల శంకరయ్య, ప్రముఖ బాల సాహితీవేత్త డా.కం దేపి రాణీ ప్రసాద్, వర్థమాన సాహితీవేత్త వాసరవేని పర్శరాములు, పం డిత పరిషత్ అధ్యక్షుడు బాల్‌రెడ్డి, కవులు తుమ్మనపెల్లి రామస్వామి, వెంగళ లక్ష్మణ్, తదితరులు ఉన్నారు.