కరీంనగర్

ప్రభుత్వం దృష్టికి సమస్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చొప్పదండి, డిసెంబర్ 12: రాష్ట్రంలోని పలు రెవెన్యూ కార్యాలయాల్లో పనిచేస్తూ ప్రభుత్వపరంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్న వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తానని రాష్ట్ర డిప్యూటి తహశీల్దార్ల సంఘం ఉపాధ్యక్షులు కృష్ణచైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం చొప్పదండి తహశీల్దార్ కార్యాలయంలో టిఆర్‌ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు మునిగాళ్ల చందు, మండల టిఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షులు మాచర్ల వినయ్ కుమార్‌ల ఆధ్వర్యంలో కృష్ణచైతన్యను ఘనంగా సన్మానించి సత్కరించారు. అలాగే మండల తహశీల్దార్ రాజయ్య చైతన్యను సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ మా మండలంలో పనిచేసే కృష్ణచైతన్య రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికకావడం హర్షనీయమన్నారు. తనను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించి తనపై మరింత బాధ్యతను రాష్ట్ర డిప్యూటి తహశీల్దార్లు పెట్టారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉద్యోగపరంగా, విధులపరంగా, ప్రభుత్వపరంగా ఏర్పడే సమస్యలను నిరంతరం వారి వెంట ఉండి పరిష్కారం దిశగా కృషి చేస్తానని తెలిపారు. తహశీల్దార్ రాజయ్య, యువజన సంఘం అధ్యక్షులు మునిగాళ్ల చందు, మాచర్ల వినయ్ కుమార్, మార్కెట్ ఉపాధ్యక్షులు బత్తిని బుచ్చయ్య, సభ్యులు ఎం.డి.రఫీక్, నాయకులు కోమల్ల రాజేశం, మునిగాళ్ల శ్రీనివాస్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
ఉద్యమంలో టీఎన్జీవోలదే కీలకపాత్ర
* సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్
ధర్మపురి, డిసెంబర్ 12: తెలంగాణ మలి ఉద్యమంలో టీఎన్జీవోల పాత్ర కీలకమైనదని, ఒక దశలో ఉద్యమ పార్టీ అధినేత కేసిఆర్ సైతం తమతో కలిసి రావడం జరిగిందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఎస్జీవోల సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ అన్నారు. మంగళవారం ధర్మపురి క్షేత్రంలో నూతన ధర్మపురి యూనిట్ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం జగదీశ్వర్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, 70ఏళ్ళ చరిత్ర కలిగిన తమ సంఘం ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తున్నదన్నారు. ఉద్యోగుల పాలిట గుదిబండలా మారిన కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు పరిచి, పాద పెన్షన్ విధానానే్న పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఖాళీలు భర్తీ కాకపోవడంతో పని భారం అధికమవుతున్నదని, వెంటనే భర్తీ ప్రక్రియ చేపట్టాలని, ఉద్యోగులు కోరుతున్న విధంగా స్థానికత ప్రాతిపదికన స్వంత జిల్లాలకు బదిలీలు చేయాలన్నారు. కొత్త జిల్లాలలో 20శాతం ఇంటిఅద్దె సౌకర్యం కల్పించాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు సుద్దాల రాజయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కోకన్వీనర్ భోగ శశిధర్, ఉద్యోగ ఐకాస గౌరవాధ్యక్షులు హరిఅశోక్ కుమార్, ధర్మపురి టీఎస్జీవో శాఖ అధ్యక్షులు దిలీప్, కార్యదర్శి రంగారావు, ఉమాపతి, విజేందర్, సుధీర్, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.