కరీంనగర్

కష్టపడి పనిచేస్తేనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి, జనవరి 2: జిల్లా అభివృద్దిలో భాగంగా ఆయా అధికారులు ప్రభుత్వం వారి శాఖల పరంగా నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేయాలని, లక్ష్యాలను సాధించినప్పుడే జిల్లా అభివృద్దిలో, సంక్షేమంలో ముందుంటుందని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో జరిగిన పరిచయ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారులు కష్టపడి పనిచేసిన నాడు ఆయాశాఖల్లో అనుకున్న లక్ష్యాలు సాధించగలరని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది పథకాలను ప్రజల వద్దకు చేరినప్పుడే అధికారులు నిజమైన ప్రజాసేవ చేసినవారవుతారని అన్నారు. వివిధ పనులతో అధికారుల వద్దకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, చిరునవ్వుతో స్వాగతించాలని సూచించారు. అధికారులు, ఉద్యోగులు వారి ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలని, వారి కుటుంబాలతో కూడా సరైన సమయం ఇచ్చి గడపాలని తెలిపారు. అధికారులు పనిని, వ్యక్తిగత జీవితాన్ని, ఉద్యోగ బాధ్యతలను సమానంగా భావించి విధులు నిర్వహించాలని అన్నారు.జిల్లాలో అందరూ మంచి అనుభవం కలిగిన అధికారులున్నారని, వారు ప్రభుత్వం ఆశయాలకనుగుణంగా పనిచేస్తూ జిల్లాను అభివృద్ధి బాటలో నడపడానికి దోహదపడాలని తెలిపారు. జిల్లాలో అధికారులు ఇతర శాఖలతో సంయమనం ఏర్పర్చడానికి, శాఖలలో అవసరమైన వసతులను కల్పిస్తామని తెలిపారు జిల్లాలో రైతులకు ఏలాంటి అసౌకర్యం కలుగకుండా యాసంగీ పంట కార్యాచరణ రూపొందించి పనిచేయాలని, జిల్లాలోని ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తూ ప్రభుత్వం అందించే పథకాలను అర్హులైన వారికి అందెలా కృషిచేయాలని అన్నారు. కలెక్టరేట్‌లో నూతన సంవత్సరం సందర్బంగా కేక్ కట్ చేసి జిల్లా అధికారులు, జిల్లాలోని ప్రజలందరికి ఇంగ్లీష్ నూతన సంవత్సర శూభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి డిఆర్‌ఓ పద్మయ్య, పెద్దపల్లి ఆర్డీవో అశోక్‌కుమార్, జిల్లా అధికారులు, జిల్లాలోని తహాశీల్దార్లు, జిల్లాలోని ఎంపిడిఓలు, జిల్లా టిఎన్జివో ప్రెసిడెంట్ శంకర్, సెక్రటరీ రాంకిషన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.