కరీంనగర్

పెద్దపల్లి కలెక్టర్‌గా దేవసేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జనవరి 2: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. మొత్తం 30 మందికిపైగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో జనగామ కలెక్టర్‌గా పనిచేస్తున్న దేవసేనను పెద్దపల్లి కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల పునర్విభజనకు ముందు దేవసేన కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన సంగతి విధితమే. గత నెల 31న ఇన్‌చార్జి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పదవీవిరమణ పొందడంతో మంచిర్యాల కలెక్టర్ కర్ణన్‌కు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అలాగే మెట్‌పల్లి సంయుక్త కలెక్టర్‌గా గౌతమ్ పా త్రును, ఇక్కడ పనిచేస్తున్న ముషారఫ్ అలీని జిహెచ్‌ఎంసి అదనపు కమీషనర్‌గా బదిలీ చేసింది. దేవసేన, గౌతమ్‌లు త్వరలోనే బాద్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.

మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసన్
పెద్దపల్లి, జనవరి 2: పెద్దపల్లి మున్సిపల్ కమీషనర్‌గా గంజి శ్రీనివాసన్‌ను నియమిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మిర్యాలగూడ గ్రేడ్-1 మున్సిపాలీటీలో మేనేజర్‌గా విధులు నిర్వహించిన శ్రీనివాసన్‌కు ప్రభుత్వం కమిషన్‌ర్‌గా పదోన్నతి కల్పించింది. దీంతో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్‌గా బదీలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మంగళవారం పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో శ్రీనివాసన్ బాధ్యతలు స్వీకరించారు. పెద్దపల్లి మున్సిపల్‌లో విధులు నిర్వహించిన సత్యనారాయణకు బదిలీ కాగా పోస్టింగ్ లభించలేదు. నూతనంగా బాధ్యలు స్వీకరించిన కమిషనర్ శ్రీనివాసన్‌ను పలువురు కౌన్సిలర్లు, ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.