కరీంనగర్

ఇసుక క్వారీల ఆకస్మిక తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, జనవరి 2: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొడిముంజ గ్రామంలో డబుల్ బెడ్‌రూం, కాళేశ్వరం 9వ ప్యాకేజీ ఇసుక క్వారీలను జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్ మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 9 ఇసుక క్వారీని కలెక్టర్ సందర్శించారు. ఇసుక క్వారీని కలెక్టర్ సందర్శించారు. ఇసుక తవ్వకాలను పరిశీలించి ఆ వెంటనే డబుల్ బెడ్‌రూం క్వారీని తనిఖీ చేశారు. మంగళవారం క్వారీలో ఎలాంటి ఇసుక తవ్వకాలు రవాణా జరుపవద్దని ఆదేశించినా సైట్‌లో కొన్ని లారీలు లోడింగ్‌లో నింపేందుకు పుంజుకున్నాయని వేములవాడ రూరల్ తహశీల్దార్ మునిందర్‌ను ప్రశ్నించారు. ఎలాంటి తవ్వకాలు, లోడింగ్ జరుపవద్దని వర్క్ ఇన్సిస్పెక్టర్, ఆర్‌ఐలను ఉదయం వౌలిక ఆదేశాలు జారీ చేశామన్నారు. లోడింగ్‌లో ఉన్న లారీలు ఉదయం నుంచే సైట్‌లో ఉన్నాయన్నారు. ఆదేశాలకు ముందే వాటిని లోడింగ్ చేశారని చెప్పారు. సైట్‌లో ఉన్న కంట్రాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ఇదే విషయన్ని కలెక్టర్‌కు తెలిపారు. ఎలాంటి అక్రమ రవాణా చేయడం లేదని కాంట్రాక్టర్ వివరణ విన్న కలెక్టర్ ఇసుక లోడ్‌తో ఉన్న లారీలను వేములవాడ రూరల్ స్టేషన్‌కు తరలించాలన్నారు. వాటి జన్యునిటీ పరిశీలించి నిబంధనలక విరుద్ధంగా రవాణా చేస్తున్నట్లయితే సీజ్ చేయాలన్నారు. జిల్లాలోని చెక్‌పోస్టులను అదుపు చేయాలన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు డబుల్ బెడ్‌రూం నిర్వహణకు ఇసుక లోడ్‌లను పంపవద్దన్నారు. వే బిల్లులు లేని ఇసుక లారీలను గుర్తిస్తే సీజ్ చేయాలన్నారు. ఆకస్మిక తనిఖీలో మైనింగ్ ఎడి సైదులు, తహశీల్దార్ మునిందర్‌లు ఉన్నారు.

‘కొత్త’ కిక్కు..!
* ఆంక్షలున్నా..్ధరలు పెరిగినా నో చేంజ్ * న్యూ ఇయర్ వేడుకల్లో ఏరులైపారిన మద్యం
* ఉమ్మడి జిల్లాలో ఒక్కరోజే 3కోట్లకుపైగా అమ్మకాలు

కరీంనగర్, జనవరి 2: పోలీసుల ఆంక్షలున్నా..మద్యం ధరలు పెరిగినా.. మద్యం అమ్మకాల్లో మాత్రం ఏలాంటి చేంజ్ కనపడలేదు. నూతన వత్సర వేడుకల్లో మద్యం ఏరులై పారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్కరోజే 3కోట్లకుపైగా అమ్మకాలు జరిగాయంటే కొత్త వేడుకలు ఏలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే, ప్రభుత్వం మద్యం విక్రయాల సమయాన్ని సడలించడంతో అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది (2016)తో పోల్చుకుంటే ఈ ఏడాది (2017)లో మద్యం అమ్మకాలు పదిశాతం పెరిగినట్లు ఆబ్కారీ అధికారులు పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ ఐఎంఎల్ డిపో పరిధిలో 315మద్యం షాపులు ఉండేవి. జిల్లాల విభజనతో కరీంనగర్ ఐఎంఎల్ డిపో పరిధిలో 217 షాపులే ఉండగా, మిగిలిన షాపులు పక్క జిల్లాలోని ఐఎంఎల్ డిపోల పరిధిలోకి వెళ్లాయి. కరీంనగర్ ఐఎంఎల్ డిపో పరిధిలోని 217షాపులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 48షాపులు, కరీంనగర్ నుంచి విడిపోయిన హుస్నాబాద్‌లో 18షాపులు కలుపుకుని మొత్తం 283షాపుల్లో నూతన వత్సర వేడుకల్లో (31వ తేదీ) ఒక్కరోజే 3కోట్ల 46లక్షల 8వేల 260 రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. అలాగే డిసెంబర్ మాసంలో 283 షాపుల్లో మొత్తం 130కోట్ల 47లక్షల 50వేల 239 రూపాయల మద్యం విక్రయాలు కొనసాగాయి. వీటితోపాటు 42బార్ అండ్ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పదిశాతం మద్యం అమ్మకాలు పెరిగినట్లు సంబంధిత ఆబ్కారీ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్థరాత్రి వరకు సమయం సడలించడంతో లిక్కర్ విక్రయాలు ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ అన్న చందంగా కొనసాగాయి. పోలీసుల ఆంక్షలు ఉన్నా, మద్యం ధరలు పెరిగినా నూతన వత్సర వేడుకల్లో మద్యం ప్రవాహనికి మాత్రం అడ్డుకట్ట పడలేక పోయింది. ఇప్పటికే శుభకార్యమైనా, అశుభకార్యమైనా, పండుగలైనా, పబ్బలైనా ఇలా ఏ కార్యమైనా మందు కిక్కు ఉండటం అనవాయితీగా ఉండగా, నూతన వత్సర వేడుకల్లో ఇంకేముంది మందుబాబులు తెగ తాగేసారు. ఈ క్రమంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకే మాసం (డిసెంబర్)లో 130కోట్ల రూపాయలకుపైగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఏదిఏమైనా ‘కొత్త’ వేడుకల్లో మందుబాబులు మద్యానికే కిక్కు ఎక్కించారు.

కేసీఆర్ సహకారంతో నియోజక వర్గ అభివృద్ధి
* మన ఊరు..మన ఎమ్మెల్యేలో శాసన సభ్యుడు మధు
కమాన్‌పూర్, జనవరి 2: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మంథని నియోజక వర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని మంథని ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. మంగళవారం మన ఊరు... మన ఎమ్మెల్యే 2లో భాగంగా రాజాపూర్, గుండారం, జల్లపల్లి, పేరపల్లి, రొంపికుంట, నాగారం, పెంచికల్‌పేటతోపాటు పలు గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. రాజాపూర్ నుంచి మంగపేటకు వెళ్లే రహదారిని పూర్తి చేస్తానని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని అన్నారు. ప్రభుత్వం ఒక వైపు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాలతో పేదింటి ఆట పిల్లలకు అండగా నిలుస్తోందని, ఇందులో భాగంగా మార్చి నెలలో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ద్వారా 200 జంటలకు సామూహిక వివాహాలు తలపెట్టడం జరిగిందని అన్నారు. కెసిఆర్ సర్కారు ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టిందని, ప్రతీ రైతును ఆదుకునేందుకే 24గంటల విద్యుత్, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీలు పూర్తి చేసి భూములను సస్యశ్యామలం చేసే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టి పూర్తి చేసే దశలో ఉన్నామని అన్నారు. అలాగే వృద్ధాప్య, వికలాంగ, వితంతు, గీత కార్మిక, ఒంటరి మహిళ పెన్షన్లను ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. మండల శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మేకల సంపత్ యాదవ్, సర్పంచ్‌లు ఆకుల గట్టయ్య, పులిపాక శారద, సాగి శ్రీ్ధర్ రావు, ఎంపిటిసి గాదె అనురాధ సదయ్య, వైస్ ఎంపీపీ కొట్టె భూమయ్య, నాయకులు దాసరి రాయలింగు, ఇనగంటి రామారావు, పీట్ల గోపాల్, పొనగంటి కనకయ్య, కొండ శంకర్, పూదరి సత్యనారాయణ, బోయిని బాలక్రిష్ణ, దామెర సంపత్, పిడుగు అంజి పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ బలోపేతం
* రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు చేపట్టాలి * కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
* బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్ వర్గీస్

కరీంనగర్, జనవరి 2: రాబోయే 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ బలోపేతం కావాలని, ఇందుకు అందరు కలిసికట్టుగా కృషిచేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ మాజీ మంత్రి కైలాస్ విజయ్ వర్గీస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక శివ నరేష్ పంక్షన్ హాలులో నిర్వహించిన బీజేపీ జిల్లా వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అటు దళితులకు అన్యాయం చేస్తోందని, ఇటు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఎంతో చమత్కార నాయకుడని, బీజేపీతో స్నేహా హస్తం చాచినట్టు వ్యవహరిస్తూ పార్టీ బలోపేతం కాకుండా చూడాలని ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను చెబుతూనే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలు, విజయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా ప్రభుత్వ వైఫల్యాలను, కేంద్ర ప్రభుత్వ విజయాలను అక్కడి మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్లకార్డుల ద్వారా విస్తృత ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతులను చేసిన తీరు చాలా అద్బుతమని అన్నారు. తెలంగాణలో కూడా అదే తరహాలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ వారిని చైతన్యవంతులను చేస్తూ, టీఆర్‌ఎస్ ప్రభుత్వ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై వివరిస్తూ పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజల మధ్యన ఉండి పోరాటాలు చేయాలని, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రధాని మోదీ దేశం కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నారని, ప్రధాని ఆశయాలకనుగుణంగా ప్రజల మద్దతు పొందాలని సూచించారు. గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను అందించిన ఘనత కరీంనగర్ జిల్లాది అని, రాబోయే ఎన్నికల నాటికి కార్యకర్తలందరూ కష్టపడి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని కైలాస్ విజయ్ వర్గీస్ పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వర్క్‌షాప్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, అధికార ప్రతినిధి సంజయ్ కుమార్, నాయకులు వేణుగోపాల్, ఆంజనేయులు, ఓదెలు, సత్యనారాయణ, శంకర్, అర్జున్ రావు, విద్యాసాగర్, స్వప్న, సుజాత, అనితాలతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.