కరీంనగర్

స్థానిక సమస్యలు పరిష్కరించకుంటే సమరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జనవరి 22: గ్రామాల్లో, గల్లీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కరించకుంటే సమరం తప్పదని తెలంగాణ సామాజిక, ప్రజా సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర నాయకుడు జి.నాగయ్య హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండటాన్ని నిరసిస్తూ టీ.మాస్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఈ నెల 4నుంచి 11వరకు నగరంలోని పలు డివిజన్లతోపాటు 13మండలాల్లో 16 బృందాలతో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలతోపాటు గ్రామాల్లో వౌలిక వసతులు కల్పించటంలో కూడా అధికారులు ఘోరంగా వైఫల్యం చెందుతున్నట్లు తేటతెల్లమైందన్నారు. నగరంలో రహదారులు, మురికి కాలువల తీరు పూర్తిగా ఆధ్వాన్నంగా మారిందని, స్మార్ట్‌సిటీగా రూపాంతరం చెందుతున్నా కనీస సౌకర్యాలు కల్పించటంలో యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. అభివృద్ధి పేర ఆర్ట్స్ కళాశాల మైదానాన్ని ఆక్రమించేయత్నం చేస్తుండటం శోచనీయమని, ఎలగందుల గ్రామంలో చెరువు శిఖం భూమి ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే లేడన్నారు. వక్ఫ్ భూములు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతుంటే, అధికారులు చోద్యం చూస్తున్నారని దుమ్మెత్తారు. ఇందిరమ్మ ఇళ్ళ సమస్య, రోడ్లు వెడల్పుతో నష్టపోయిన వారికి పరిహారం అందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రజక, మేదర, నాయిబ్రహ్మణ ఫెడరేషన్లకు నిధులు విడుదల చేయకుండా, జాప్యం ప్రదర్శించటం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. సంచార జాతులైన గంగిరెద్దులు, బేడ బుడగ జంగాల వారికి సంక్షేమ పథకాలు అందటంలేదని, ప్రైవేటు సంస్థల్లో కార్మిక చట్టాలు అమలు చేయకుండా శ్రమ దోపిడీ చేస్తున్నా పట్టింపులేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పోరేషన్ల ద్వారా రుణాలు మంజూరైన బ్యాంకర్ల తిరకాసులతో నిరుపేద, మద్య తరగతి లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారని, పాలకులు స్పందించి ప్రభుత్వ యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సమస్యలు, నిరుద్యోగుల ఇబ్బందులు తొలగించాలని, లేనిపక్షంలో యువతను సమీకరించి భారీ ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో సీపీఎం జిల్లాకార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, నాయకులు మర్రి వెంకటస్వామి, వర్ణ వెంకటరెడ్డి, వసీం అహ్మద్, భాగ్యలక్ష్మి, ఎడ్ల రమేశ్, సదానందం, సుంకరి సంపత్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

స్మార్ట్‌సిటీ పనులు వేగవంతం చేయాలి
* మేయర్ రవీందర్‌సింగ్
కరీంనగర్ టౌన్, జనవరి 22: స్మార్ట్‌సిటీలో భాగంగా కరీంనగర్ నగరంలో చేపట్టాల్సిన పలు పనులు ప్రారంభించి, వేగంగా పూర్తి చేయాలని మేయర్ రవీందర్‌సింగ్ సూచించారు. స్మార్ట్ సిటీ పనులు చేపట్టనున్న ఆర్వీ అసోసియేషన్ కన్సల్టెన్సీ బృందంతో సోమవారం కమీషనర్ కె.శశాంకతో కలిసి ఆయన తన ఛాంబర్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నగరంలో జరుగుతున్న రూ.247కోట్ల అభివృద్ధి పనులు, నగర ముఖచిత్రంతోపాటు పలు అంశాలపై చర్చించారు. ఈ నెల 25న నగరంలో పర్యటించనున్న స్మార్ట్ సిటీ మిషన్ డైరెక్ట్‌కు చేయాల్సిన ప్రాజెక్ట్ ప్రజెంటేషన్‌పై సలహాలు, సూచనలు చేశారు. ఈ ఏడాది జూన్ నాటికల్లా నగరంలో స్మార్ట్ సిటీ పనులు కనిపించాలని, మూడు రోజుల పాటు నగరంలో కన్సల్టెన్సీ బృందం పర్యటించి, ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ చేసి, ప్రాజెక్ట్ మిషన్ డైరెక్టర్ సమీర్‌శర్మకు వివరించాలని సూచించారు. ప్రస్తుతం నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు దృష్టిలో పెట్టుకుని, స్మార్ట్‌సిటీ పనులకు ప్రణాళిక రూపొందించాలని, నగర పాలక సంస్థ కన్సల్టెన్సీ కంపనీకి ప్రతిపాదనలు చేసిన ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి సారించి, నివేదిక సిద్ధం చేయాలన్నారు. అనంతరం హరితహారం, నీటి సరఫరా ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో మూడు విడతలుగా నాటిన హరితహారం మొక్కలపై అధికారులు సక్రమంగా దృష్టి సారించటంలేదని, వేసవి సమీపిస్తున్న దృష్ట్యా మొక్కల సంరక్షణ, నీటి సరఫరాపై ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు నిత్యం డివిజన్లు సందర్శించాలన్నారు. నగర ప్రజలకు కూడా మొక్కల సంరక్షణపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు.