కరీంనగర్

ఎస్సారెస్పీ కాల్వనీటి విడుదలకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, జనవరి 23: శ్రీరాం సాగర్ ప్రాజెక్టు డి-83, డి-86 కాల్వల ద్వారా రబీ సాగుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్‌లో మంత్రి ఈటల రాజేందర్ ఎస్సారెస్పీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కాల్వ నీరు సరఫరా విషయమై చర్చించినట్టు ఆయన పేర్కొన్నారు. మండలంలోని అప్పన్నపేట గ్రామంలో మంగళవారం స్థానిక రైతులతో సమావేశం ఏర్పాటు చేసి, సాగు నీరు సరఫరాకు చేపడుతున్న చర్యల గురించి వివరించారు. సోమవారం సహకార బ్యాంకు ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యే రైతులను అడ్డుకున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో అదే విషయమై రైతులతో సమావేశం ఏర్పాటు చేసి కాల్వ నీరు విడుదల కోసం తాను చేస్తున్న కృషి గురించి తెలియజేశారు.
రాష్ట్రంలో నియంత పాలన
* మాజీ ఎమ్మెల్యే
పెద్దపల్లి, జనవరి 23: తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని, రైతులకు సాగునీరివ్వకుండా నాలుగేళ్లుగా అసమర్థత పాలన కొనసాగిస్తున్నారని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు అన్నా రు. మంగళవారం సుల్తానాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిథి సీ. సత్యనారాయణరెడ్డితో కలిసి విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం గత నాలుగేళ్ల కాలంలో రైతులకు సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. 34ఏళ్ల కాలంలో డీ 83,86 కాలువ నుండి రైతులకు సాగునీరు వస్తున్నాయని, ఈఅసమర్థత ప్రభుత్వం రైతులు మోటార్లు పెట్టుకోవద్తని చెప్పడం సిగ్గుచేటన్నారు. నిరసన తెలిపే హక్కులను కాలరాస్తూ నీచరాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. రైతులకు సాగునీరడుగుతే ముందుస్తు రాజకీయ పార్టీల నాయకులను అరెస్టులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈనెల 25న మాజీ మంత్రి శ్రీ్ధర్‌బాబు ఆధ్వర్యంలో సాగునీటి కోసం కలెక్టర్ ముట్టడిస్తామని కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు, నాయకులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు.