కరీంనగర్

కొండగట్టుకు పోటెత్తిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, జనవరి 23: ఉత్తర తెలంగాణలో ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజనేయ స్వామి ఆలయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు దాదాపు లక్ష వరకు చేరుకున్న భక్తులతో ఆలయం కిటకిటాలాడింది. మంగళవారం రోజే భక్తులు స్వామివారి దర్శనం కోసం తీసుకున్న టికెట్ల అదాయం 12 లక్షలు సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈనెల 31నుండి ఫిబ్రవరి 3 వరకు జరిగే సమ్మక్క, సారక్క జాతరను పురస్కరించుకుని ఉమ్మడి జిల్లాలైన అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల నుండి తరలివస్తున్న భక్తులు మొదట వేములవాడను రాజన్నను దర్శించుకుని కొండగట్టులో స్వామి వారి సన్నిదిలో నిద్రలు, పూజలు చేసుకుని మేడారం సమ్మక్క సారక్క జాతరకు పయణమవుతుండడంతో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో రద్దీ తీవ్రంగా ఎర్పడి భక్తుల తాకిడి ఏర్పడింది. మంగళవారం పెద్ద ఎత్తున సమ్మక్క సారక్క భక్తులు కొండగట్టుకు తరలివస్తారని అంచనా వేసిన అధికారులు ముందస్తుగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేశారు. అలయ ఇఒ అమరేందర్, ఎఇఒ బుద్ది శ్రీనివాస్‌లు ఎర్పట్లు పర్యవేక్షించారు. కొండపై వ్యాపారుల అగడాలు, నిలువుదోపిడిపై సర్వత్ర విమర్శలు చోటు చేసుకుంటున్న అధికారుల శీతకన్ను సర్వత్ర విమర్శలు తావిస్తుంది. కోనేరు వద్ద భక్తులు దుర్గంద నీటిలో స్నానమచరించడం వల్ల ఇబ్బందిగా ముక్కు మూసుకుని స్నానమచరించి విమర్శలు చేశారు. అలాగే కల్యాణ కట్ట వద్ద తల వెట్రుకలు ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసి సేకరించకపోవడం వల్ల తల వెట్రుకలన్ని పరిసర ప్రాంతాలకు కొట్టుకుపోయి అశుభ్రత ఎర్పడి అధికారుల దృష్టికి తీసుకువెల్లిన మార్పు రాకపోవడం విమర్శలు తావించింది. మంగళవారం సాయంత్రం జిల్లా ఎస్పీ అనంతశర్మ అంజనేయ స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా అలయ ఇఓ అమరేందర్ ఎఇ బుద్ది శ్రీనివాస్‌లు ఘనంగా సన్మానించారు. బుధవార హుండి లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

నగరంలో జనసేనాని సందడి
* సెల్ఫీల కోసం పవన్ కళ్యాణ్ అభిమానుల అత్యుత్సాహం * సీఎం జిందాబాద్ అంటు నినాదాలు

కరీంనగర్ రూరల్, జనవరి 23: ప్రముఖ సినీనటుడు, జనసేనా ఆధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన చలోరే చల్ చలోరేలో భాగంగా నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ పార్లమెంటరి స్థాయి కార్యకర్తల సమావేశంను కొత్తపల్లి మండలంలోని రేకుర్తిలోని శుభం గార్డెన్స్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ అభిమాన హీరో వచ్చిన విషయం సెల్ఫీల కోసం, అటోగ్రాఫ్‌ల కోసం అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తమ అభిమాన హీరోకోసం కోర్టు చౌరస్తా నుంచి శుభం గార్డెన్ వరకు భారులు తీరి నినాదాలతో హోరేత్తించారు. అలాగె సమావేశమందిరంలోకి వచ్చేముందు అభిమానుల తాకిడి ఒకేసారి పెరగడంతో గందరగోల పరిస్థితులు నెలకోన్నాయి, కాగా పోలీసుల సహాయంతో స్టేజి పైకి రాగా గార్డెన్‌లో వున్న అభిమానులు పవన్ కళ్యాన్ సియం సియం అంటు నినాదాలు చేస్తు అందరు స్టేజిపైకి వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు, పవన్ కళ్యాణ్ ప్రయివేటు సెక్యురిటి రక్షణగా వుండి అభిమానులను, కార్యకర్తలను క్రిందకు దించివేశారు. అభిమానుల తోపులటో ఒక్కరికి గాయలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాన్ అతన్ని స్టేజిపైకి పిలిచి ఒదార్చాడు, అనంతరం 4 జిల్లాల కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అలాగె మహిళ అభిమాని గీత పవన్ కళ్యాన్‌కు రాఖీ కట్టి అభిమానాన్ని చాటుకుంది. కాగా జనసేనా ఆధినేత మాట్లాతున్నాంత సేపునినాదాలు చేస్తు హంగామ సృష్టించారు. దీంతో కొద్దిసేపుప్రసంగాన్ని ఆపారు. పోలీసులు భారీబందోబస్తు నిర్వహించండంతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగలేదు.
ముగిసిన జనసేనాని పర్యటన
కరీంనగర్ టౌన్: జన సేనాధినేత పవన్ కళ్యాణ్ రెండ్రోజుల పర్యటన జిల్లాలో మంగళవారం ముగిసింది. ‘చలోరే చల్ చలోరే’ పేరిట చేపట్టిన తన జిల్లాల పర్యటనలో భాగంగా మొట్టమొదటగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభించగా, సోమవారం తన ఇష్టదైవమైన కొండగట్టు అంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం ఉమ్మడి జిల్లా కేంద్రానికి చేరుకుని, సోమవారం సాయంత్రం కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ల ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేకంగా బేటీ అయ్యారు. సమన్వయకర్తల నియామకంపై చర్చించి, పార్టీకి ఉమ్మడి జిల్లాలో ఉన్న ఆదరణపై ఆరా తీశారు. మంగళవారం మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో నగర శివారులోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని, వారికి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, జరుగబోయే పరిణామాలపై దిశా,నిర్ధేశం చేశారు. ప్రధానంగా పాజిటివ్ పాలిటిక్స్‌పైనే జనసేన దృష్టి సారించబోతుందని వెల్లడిస్తూనే, మార్చి 14వరకు పార్టీ కార్యాచరణ వెల్లడిస్తానని ప్రకటించి, జిల్లాలో తన పర్యటనకు ముగింపు పలికారు. త్వరలోనే సంపూర్ణ రాజకీయాల్లోకి వస్తున్నానంటూ, కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం తన రాజకీయ కార్యాచరణ వెలువరిస్తానంటూ ప్రకటించటంతో రాష్ట్రంలో జనసేన పార్టీ రాజకీయ వేదికగా ఆవిర్భవించబోతుందనే ఆశ ఆయన అభిమానులతోపాటు రాజకీయ నిరుద్యోగుల్లో నెలకొంది. అయితే, ఎలాంటి ప్రకటనలు చేయకుండా కేవలం అభిమానుల అభిప్రాయాలు సేకరిస్తూ, క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వచ్చే స్పందన గమనించటం వరకే పరిమితమవుతూ, జిల్లాలో తన పర్యటన ముగించిన పవన్ తమ ఆశలపై నీళ్ళు చల్లాడనే అభిప్రాయాలను కార్యకర్తలు, అభిమానులే వ్యక్తపరుస్తుండటం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం వేచిచూస్తున్న ప్రజానీకం కూడా జన సేన అధినేత పవన్ ప్రకటన కోసం వేచి చూస్తుండగా, రెండు రాష్ట్రాల్లో పాలక ప్రభుత్వాలపై ప్రశంసల జల్లు కురిపించటంతో జనసేన పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా అవతరించటం అనుమానమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించాలి
* టీజాక్ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్

కరీంనగర్, జనవరి 23: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం చాలా సంక్షోభంలో ఉన్నదని, రైతుల జీవితాల్లో వెలుగులు నిండాలంటే సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించాల్సిన అవసరముందని టీజాక్ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చేవిధంగా టీజాక్ కార్యాచరణ ఉంటుందని, స్పష్టమైన విధానంకై రైతుల పక్షాన టీజాక్ నిలిచి పోరాడుతుందని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం స్థానిక ఫిల్మ్‌భవన్‌లో టీజాక్ ఆధ్వర్యంలో ‘రైతాంగ సదస్సులు-కార్యాచరణ’పై అనే అంశంపై ప్రాంతీయ స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ రైతు ఆధ్యయన యాత్రలలో అనేక విషయాలలో తమ దృష్టికి వచ్చాయని, వాటన్నింటిని క్రోడికరించి ఫిబ్రవరి 4న జరిగే రాష్ట్ర స్థాయి సమావేశంలో తగిన కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. సమగ్ర వ్యవసాయ విధానం లేకనే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. రైతుల శ్రేయస్సు కోసం, లాభ సాటి వ్యవసాయం కోసం అనేక డిమాండ్ల రైతుల వైపు నుంచి ఉన్నాయని తెలిపారు. ప్రధానంగా సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టాలని, నాణ్యమైన విత్తనాలు, మందులు అందేలా చర్యలు తీసుకోవాలని, దళితులకు మూడెకరాల భూ పంపిణీ తదితర సమస్యలను పరిష్కరించాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. టీజాక్ రీజినల్ కో-ఆర్డినేటర్ జక్కోజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో టీజాక్ ప్రతినిధులు గురిజాల రవీందర్, ముక్కెర రాజు, బొజ్జ కనుకయ్య, డొంకెన రవి, చుక్కా గంగారెడ్డి, ఎం.వెంకటరెడ్డిలతో పాటు పలువురు పాల్గొన్నారు.

ఎక్స్‌గ్రేషియాకై రైతు కుటుంబాల ఆందోళన
* కలెక్టరేట్ ఎదుట ధర్నా
కరీంనగర్ టౌన్, జనవరి 23: అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న ఉమ్మడి జిల్లాలోని రైతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా సత్వరమే అందజేయాలని డిమాండ్ చేస్తూ, మరణించిన రైతుల కుటుంబాల సభ్యులు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. సుమారు గంటకు పైగా వందమందికి పైగా రైతులు ప్రధాన ద్వారం ఎదుట ధర్నా నిర్వహించారు. తెలంగాణ రైతుల ఐక్యవేదిక ఆధ్వర్యంలోనిర్వహించిన ఈ ఆందోళనలో పాల్గొన్న ఆసంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ముదుగంటి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని, పెట్టుబడులు భారమై, అప్పులు పెరిగి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఇప్పటివరకు ఆదుకోకపోవటం శోచనీయమన్నారు. ఓవైపు అప్పులు పెరుగుతుంటే, ఎకరాకు రూ.4వేల పెట్టుబడి అందజేస్తామంటూ ప్రకటనలు చేయటం విడ్డూరమన్నారు. మద్ధతు ధర పెంచటంలోచోద్యం చూస్తూ, వ్యవసాయానికి రైతులను దూరం చేస్తున్న పాలకులకు తగిన బుద్దిచెబుతామని హెచ్చరించారు. క్వింటాల్ వరి ధాన్యానికి రూ.2040 ఖర్చు వస్తుండగా, కేవలం రూ.1600 మాత్రమే మద్ధతు ధర ప్రకటించటం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలుండవని ప్రకటించిన ఉద్యమ నేత హోదాలో ప్రకటించిన కేసీఆర్ ప్రస్తుతం రాష్టమ్రుఖ్యమంత్రిగా కొనసాగుతున్నా రోజు రోజుకు రైతు సమస్యలు పెరుగుతూ, అదేస్థాయిలో ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన రైతుల కుటుంబాలకు రూ.6లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే ఎన్నికల్లో రైతులంతా ఏకమై తగిన గుణపాఠం చెప్పటం ఖాయమన్నారు. ఈధర్నాలో మరణించిన రైతుల కుటుంబాల సభ్యులతో పాటు రైతు నాయకులు నల్ల పుల్లారెడ్డి, అలుమల్ల సుధాకర్‌రెడ్డి, ఊట్ల పోచమల్లు, రాచమల్ల నర్సింహ, చిలుముల శివప్రసాద్, చెలుపూరి శ్రీనివాస్, జసుప రాజయ్య, న్యాలకొండ తిరుపతి, బైరి పోసిరెడ్డి, గుగులోతు సరోజనతోపాటు పలువురు పాల్గొన్నారు.

మూడేళ్లలో 3వేల కిలోమీటర్ల రోడ్లు
* రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు * సింగరేణికి పూర్వ వైభవం తెస్తాం: మంత్రి ఈటల
* రామగుండం ఐకాన్‌గా ఎఫ్‌సీఐ: ఎంపీ సుమన్
గోదావరిఖని, జనవరి 23: దశాబ్దాల పాటు పాలించిన నాటి పాలకులు తెలంగాణలో 2వేల కిలోమీటర్లే రోడ్లు వేస్తే... తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి గడిచిన మూడేళ్లలో మూడు వేల కిలోమీటర్ల రహదారులను నిర్మించుకోగలుగుతున్నామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో నిర్మాణం చేసిన రైల్వే ఫ్లైఓవర్‌ను ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్, ఆర్టీసీ చైర్మన్ సొమారపు సత్యనారాయణతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం తరువాత రవాణాను పరిపూర్ణంగా మెరుగు పరుచుకున్నామని, గత ప్రభుత్వాలకు చేతకాక... చేయలేని అభివృద్ధి మన తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ నాయకత్వాన చేసుకుంటున్నామని అన్నారు. లక్షల కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేసుకుంటున్నామని, ఎవరెన్ని చెప్పినా కాళేశ్వరం అనుకున్న సమయానికి పూర్తి చేయించి ప్రాజెక్ట్‌లతో ఉగాది వరకు రాష్ట్రంలో గోదావరి నీరును సరఫరా చేయిస్తామని అన్నారు. 48వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు, అంగన్‌వాడీ కేంద్రాలతో 25 లక్షల మందికి చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నామని అన్నారు. రామగుండంలో మరో తొమ్మిది కోట్లతో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ... సింగరేణి బొగ్గు పరిశ్రమకు ఆలస్యమైనా పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పారు. వచ్చే ఏడాదిలో రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి ఎరువుల సరఫరా జరుగుతుందని పేర్కొంటూ... నీటి ప్రాజెక్ట్‌లపై కొందరు చేస్తున్న శికండి రాజకీయాలకు స్వస్తి పలకాలని రాజేందర్ హెచ్చరించారు. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ... రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి ఎఫ్‌సీఐ ఒక ఐకాన్‌గా నిలిచిపోనుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ... రామగుండం జెన్‌కో పవర్ ప్లాంట్ స్థానంలో కొత్త థర్మల్ కేంద్రం ఏర్పాటు జరిగేలా చూడాలని, ఈ విషయంపై సీఎం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రికి వివరించారు. అన్ని రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం ఊహించని అభివృద్ధి చేస్తుందని చెప్పారు. సమావేశంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.